మోడీకి చప్పట్ల అనుభవం: ఈ సారి బలమైన లక్ష్మణ రేఖ!

By Sree s  |  First Published Apr 3, 2020, 10:05 AM IST

ప్రజలకుకరోనా పై పోరుకు  పిలుపునిచ్చిన తరువాత స్పీచ్ ను ముగించేముందు ప్రజలకు మోడీ పదే పదే సోషల్ డిస్టన్సింగ్ పాటించమని పిలుపునిచ్చారు. సోషల్ డిస్టెన్సిన్గ్ అనే లక్ష్మణ రేఖను అందరూ కూడా పాటించాలని, ఎవ్వరు కూడా తమ బాల్కనీని కానీ దర్వాజాను కానీ దాటి బయటకు రావొద్దని స్పష్టం చేసారు. 


  భారతదేశంలో లాక్ డౌన్ 9 రోజులుగా కొనసాగుతున్న సందర్భంగా ప్రధాని మోడీ భారత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇన్ని రోజులుగా భారతీయులు ఈ కరోనా పై పోరులో చూపెడుతున్న నియమ నిష్టలు, అందిస్తున్న సహాయ సహకారాలు అద్భుతం, అద్వితీయం అని ప్రధాని మోడీ కొనియాడారు.    

ఈ ప్రస్తుత లాక్ డౌన్ అవసరం. అందరం ఇండ్లలోనే ఉండాలి. అలా అని ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. 130 కోట్ల సామూహిక శక్తి ఇది అని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు ప్రజలందరి దగ్గరినుండి ఆదివారం రోజున 9 నిమిషాలు కోరారు. 

Latest Videos

కరోనా అంధకారాన్ని జయించాలంటే... ప్రకాశవంతమైన జ్వాలలు అవసరమని, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆఫ్ చేసి బాల్కనీలల్లకు, దర్వాజల వద్దకు వచ్చి తమకు అందుబాటులోని వెలుగులను ప్రసరించాలని కోరారు. 

కొవ్వొత్తి కానీ, దీపం కానీ, ఆఖరకు మొబైల్ ఫ్లాష్ లైట్ కానీ ఏదో ఒకదాన్ని నలువైపులా ప్రసరింపజేస్తే... కరోనా అంధకారం పై మనం గెలుస్తామన్న శక్తి వస్తుందని, ఈ యుద్ధంపై భారత జాతి అంతా కూడా ఐకమత్యంతో ఉందనే సందేశం వెళుతుందని, ఇండ్లలో ఉన్నవారు ఈ పోరులో ఒంటరులు కారు అని చాటి చెప్పాలని మోడీ పిల్లుపునిచ్చారు.  

ఇలా ప్రజలకుకరోనా పై పోరుకు  పిలుపునిచ్చిన తరువాత స్పీచ్ ను ముగించేముందు ప్రజలకు మోడీ పదే పదే సోషల్ డిస్టన్సింగ్ పాటించమని పిలుపునిచ్చారు. సోషల్ డిస్టెన్సిన్గ్ అనే లక్ష్మణ రేఖను అందరూ కూడా పాటించాలని, ఎవ్వరు కూడా తమ బాల్కనీని కానీ దర్వాజాను కానీ దాటి బయటకు రావొద్దని స్పష్టం చేసారు. 

మోడీ ఇంతలా ప్రజలను హెచ్చరించాడు, రిక్వెస్ట్ చేయడానికి కూడా కారణం లేకపోలేదు. ఆయన జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు డాక్టర్లకు, మనకోసం పనిచేసే నిత్యావసరాల సిబ్బందికి గౌరవ సూచకంగా, ప్రజలంతా దేశంతో పాటుగా నిలబడ్డారు అనే సంఘీభావ సూచకంగా చప్పట్లు కొట్టమన్నారు. 

ప్రజలంతా మాత్రం ఇలా చప్పట్లు కొట్టడానికి అధికప్రాధాన్యతను ఇచ్చి అత్యంత ముఖ్యమైన సోషల్ డిస్టెంసింగ్ ను మరిచారు. సాయంత్రం 5 గంటలకే తామేదో కరోనా పై యుద్ధంలో విజయం సాధించేశామన్నట్టుగా వారు ర్యాలీలు తీశారు. గంటలు, పళ్ళాలు పట్టుకొని వీధులు తిరిగారు. అత్యంత ఆవశ్యకమైన, కరోనా పై పోరులో అతి పెద్ద అస్త్రంగా సోషల్ డిస్టెంసింగ్  ని మాత్రం మరిచారు. 

ఈ సారి కార్యక్రమంలో ఆ తప్పు మాత్రం జరగొద్దని ప్రధాని మోడీ చాలా జాగ్రత్తగా, సోషల్ డిస్టెన్సిన్గ్ అనే లక్ష్మణ రేఖను ఎవ్వరు కూడా అతిక్రమించొద్దని, అసలు ఇండ్లలోంచి బయటకు రావొద్దని తెలిపారు. 

click me!