కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశవ్యాప్తంగా కేంద్రం ఐదవ దశ లాక్ డౌన్ ప్రకటించిన కొద్ది రోజుల తరువాత నిరుద్యోగంపై సిఎంఐఇ ఒక నివేదిక వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, దీంతో వేలాది మంది కార్మికులను నిరుద్యోగులు అయ్యారు.
న్యూ ఢిల్లీ: భారతదేశంలో మే నెలలో నిరుద్యోగ రేటు అత్యధికంగా ఉన్న 2.1 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాల్లో చేరారని, కార్మిక మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డాయని ప్రైవేట్ థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) మంగళవారం తెలిపింది.
మే నెలలో చాలా మంది కార్మికులు తమ పనికి తిరిగి వచ్చారు. అయితే, నిరుద్యోగత రేటు మాత్రం 23.5 శాతంగా చాలా ఎక్కువగా ఉందని తెలిపింది."మేలో మొత్తం 2.1 కోట్ల కొత్త ఉద్యోగాలు నియమకాలు జరిగాయి, కార్మిక భాగస్వామ్య రేటు గణనీయంగా మెరుగుపడింది" అని సిఎంఐఇ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశవ్యాప్తంగా కేంద్రం ఐదవ దశ లాక్ డౌన్ ప్రకటించిన కొద్ది రోజుల తరువాత నిరుద్యోగంపై సిఎంఐఇ ఒక నివేదిక వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, దీంతో వేలాది మంది కార్మికులను నిరుద్యోగులు అయ్యారు.
also read కరోనా ఉగ్రరూపం.. హారతి కర్పూరంలా కరిగిపోతున్న ‘బ్రాండ్’ వాల్యూ
"ఏప్రిల్‌లో ఉద్యోగాలను విడిచిపెట్టిన చాలా మంది ప్రజలు మేలో మళ్ళీ తిరిగి వచ్చారు. లాక్‌డౌన్ సడలింపులతో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలు తిరిగి తెరుచుకోవడంతో మే నెలలో 1.44 కోట్ల మందికి వీటిలో ఉపాథి లభించిందని సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉపాథి 7.5 శాతం పెరిగిందని సీఎంఐఈ చీఫ్ మహేష్ వ్యాస్ వెల్లడించారు.
మేలో నిరుగ్యోగ రేటు స్ధిరంగా 23.5 శాతమే ఉన్నా కార్మిక భాగస్వామ్య రేటు 35.6 శాతం నుంచి 38.2 శాతానికి, ఉపాధి రేటు 27.2 శాతం నుంచి 29.2 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు."ఏప్రిల్ లో ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిన వారీలో చాలామంది మే నెలలో తిరిగి వచ్చారు, ఇప్పుడు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు," అని అన్నారు.