
ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది. వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రధాని మోడీ దేశమంతా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందే.... దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించివేశాయి.
ఇలా లాక్ డౌన్లకు కొందరు సహకరిస్తుండగా... మరికొందరేమో పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు కూడా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైతే.... వారి రీతిలో సమాధానమిస్తున్నారు.
Also Read:ఏపీ, తెలంగాణ సరిహద్దులో ముదిరిన వివాదం: పోలీసులపై రాళ్ల దాడి
ఇక ఈ పరిస్థితుల్లో కూడా పోలీసులు, డాక్టర్లు, మునిసిపల్, రెవిన్యూ, అత్యవసర సేవల సిబ్బంది మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ మన జీవితం బాగుండాలని పనిచేస్తున్నారు.
ఇలా పనిచేస్తున్న ఒక పోలీస్ తాను డ్యూటీకి వెళ్లేందుకు తయారవుతూంటే అతని చిన్నకొడుకు ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దు అంటుంటే... మన గుండె బరువెక్కి కళ్ళు చెమర్చడం ఖాయం.
వివరాల్లోకి వెళితే... ముంబై పోలీసు డిపార్టుమెంటులో పనిచేసే ఒక పోలీసు డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆయన అలా రెడీ అవుతున్న తరుణంలో అతడి కొడుకు బాధగా నాన్న వెళ్లొద్దు అని అడగడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
నాన్న బయటకు వేళ్ళకు బయట కరోనా ఉంది అని ఆ పిల్లడు ఏడుస్తుంటే... ఆ తండ్రి ఆ కొడుకుని ఊరుకోబెట్టే ప్రయత్నం చేయడం సోషల్ మీడియాలో అందరిని కదిలించివేస్తుంది.
చాలా మంది నెటిజన్లు ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు ఇలా పని చేస్తున్నారు అంటూ తెగ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.