కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో రెండు పెద్ద ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొంది
భువనేశ్వర్:కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో రెండు పెద్ద ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఒక్కో ఆసుపత్రుల్లో కనీసం వెయ్యి బెడ్స్ ఉండేలా సర్కార్ ప్లాన్ చేసింది.
రాష్ట్రంలో రెండు భారీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకొన్నారని సీఎంఓ గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌యూఎం, కిమ్స్ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొంది. ఈ మేరకు ఆ ప్రకటనలో సీఎంఓ వివరించింది.భువనేశ్వర్ లో వెయ్యి పడకలతో రెండు ఆసుపత్రులు ప్రత్యేకించి కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రోగులను వైద్యం చేసేందుకు ఏర్పాటు చేయనున్నారు.
also read:నిర్మలా సీతారామన్ ప్రకటన: కేంద్ర ప్రభుత్వ కరోనా ఆర్థిక ప్యాకేజీ ఇదీ...
ఈ రెండు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే దేశంలోనే కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులుగా చరిత్ర సృష్టించనున్నాయి.ప్రజల కోసం సేవ చేసేందుకు ముందుకు వచ్చిన కార్పోరేట్ సంస్థలు ఓఎంసీ, ఎంసీఎల్ కంపెనీలను సీఎం నవీన్ పట్నాయక్ అభినందించారు.
ఈ రెండు ఆసుపత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని పలు చోట్ల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.దేశ వ్యాప్తంగా ఇప్పటికే 649 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.