లాక్‌డౌన్ కారణంగా అందరి బాధ ఒకటైతే మందు బాబుల అవస్థలు ఇంకోరకం. దేశవ్యాప్తంగా ఎక్కడా మందు లభించకపోవడంతో వింతగా ప్రవర్తిస్తుండటంతో మెంటల్ ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.
లాక్‌డౌన్ కారణంగా అందరి బాధ ఒకటైతే మందు బాబుల అవస్థలు ఇంకోరకం. దేశవ్యాప్తంగా ఎక్కడా మందు లభించకపోవడంతో వింతగా ప్రవర్తిస్తుండటంతో మెంటల్ ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.
దీంతో వీరి బాధలపై స్పందించిన కేరళ ప్రభుత్వం మందు బాబులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి వైద్యుల నుంచి మద్యానికి బానిసైనట్లు ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది.
Also Read:వైన్ షాపులపై నకిలీ జీవో పుకార్లు, అరెస్టు: తెలంగాణ కరోనా కేసులు 76
అలాంటి వారికి మాత్రమే ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేస్తుంది. దీనిపై డాక్టర్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే మందు బాబుల వింత ప్రవర్తనతో పాటు చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మద్యం దుకాణాలను తెరిచేది కేవలం వాళ్ల కోసమేనని సర్కార్ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి బానిసైన వారు మతి తప్పి వింతంగా ప్రవర్తిస్తున్నందన ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది.
Also Read:మద్యం దొరక్క పిచ్చి.. ఎర్రగడ్డ ఆస్పత్రి కిటకిట, ఇందూరులో ఐదుగురు మృతి
అయితే వైద్యుల దగ్గరి నుంచి మద్యం లేకుండా ఉండలేకపోతున్నామనే ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి. అప్పుడు వాటిని పరిశీలించి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో పాస్‌లు ఇస్తామని సర్కార్ వెల్లడించింది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్పుబట్టింది. మద్యానికి బానిసైన వారికీ శాస్త్రీయ పద్ధతిలో ఇంట్లో లేదా ఆసుపత్రిలో చికిత్స చేయాలి. లేదా ఆసుపత్రిలోనే ఉంచి మందుల ద్వారా నయం చేయాలని అసోసియేషన్ కేరళ అధ్యక్షుడు తెలిపారు. కాగా మద్యానికి బానిసైన అయిన ముగ్గురు మందు దొరక్క ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.