న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటం, మరో పక్క లాక్ డౌన్ ఆంక్షలతో ప్రజలు ఇంటికి పరిమితమవుతున్నారు. సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం వెబ్ బ్రౌజర్ ద్వారా బిగ్ స్కీన్ (డెస్క్ టాప్), పై వీడియోలను వీక్షించే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది.
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో, వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులో తీసుకొచ్చింది. చాలా వరకు సెలెబ్రిటీలు, ఇతరులు లైవ్ వీడియోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు లైవ్ వీడియోలను చూస్తుండగానే , కింద వున్న విండో ద్వారా కామెంట్లను స్క్రోల్ చేయవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఇప్పుడు పెద్ద స్క్రీన్ డివైస్ లలో ప్రత్యక్ష ప్రసారాలను, లైవ్ వీడియోలను వీక్షించ వచ్చని తెలిపింది. అయితే యూజర్లు ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులతో లైవ్ వీడియోలో వుండటం, ఒకరి కన్నా ఎక్కుమందితో ఒకేసారి చాట్ చేయడం కష్టమవుతుందని కూడా తెలిపింది.
అలాగే, ల్యాప్‌టాప్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు కాబట్టి, ఐఫోన్, ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించు కోవచ్చని ప్రకటించింది. ఇంకో విషయం ఏంటంటే
కరోనా వైరస్ సోకి ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పేషెంట్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను ఇటీవల ప్రకటించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా రోగులకు ఒంటరి భావనను పోగొట్టేందుకు కో-వాచింగ్ పేరుతో కొత్త అవకాశాన్ని ఆవిష్కరించింది.
also read
కరోనా దెబ్బకి మారుతున్న రూట్: ఆన్‌లైన్‌లోకి బిగ్‌బజార్, స్పెన్సర్స్, మెట్రో..
దీని ద్వారా ఇంట్లో స్వీయ నిర్బంధంలో (క్వారంటైన్) లేదా ఐసోలేషన్ వార్డులో వున్న యూజర్లు ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు.
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని పైన ఉన్న వీడియో గుర్తును క్లిక్ చేసి తమ స్నేహితుల పోస్టుల, స్టోరీలు లేదా ఇన్ స్టా లైవ్ లను ఒకేసారి వీక్షించవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ వెబ్ బ్రౌజర్ నుండి డైరెక్టుగా సందేశాలను పంపుకునే అవకాశాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇన్‌స్టాగ్రామ్ కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని అనేక కొత్త అప్ డేట్ లను ప్రకటించింది. కరోనా వైరస్ పై అవగాహన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రోత్సహించడానికి స్టిక్కర్లను, కరోనా వైరస్ పై తప్పుడు వార్తలను షేర్ చేసిన ఖాతాలను తొలగించడం, విరాళాలు, భౌతిక దూరాన్ని పాటించే వారు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడేలా భాగస్వామ్య కథనాలను ఇవ్వడం, స్టే హోమ్ స్టిక్కర్‌ను ఉపయెగించుకుని, వీడియో చాట్ ద్వారా స్నేహితులతో చాటింగ్ చేసే అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.