దేశం లాక్ డౌన్.. గాయపడిన భార్యను సైకిల్ పై..

By telugu news teamFirst Published Mar 28, 2020, 9:52 AM IST
Highlights

అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక ఎవరి సహాయం అందక.. భార్యను సైకిల్ పై కూర్చొపెట్టుకొని దాదాపు 12కిలోమీటర్లు..దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. 

కరోనా భయం.. మనుషుల్లో మానవత్వాన్ని చంపేసిందా అనే అనుమానం కలుగుతుంది. కళ్ల ఎదుటే ఓ మనిషి ప్రాణం పోతున్నా...  కనీసం చేయూతనివ్వడాని కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి రోడ్డు మీదే ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ కాపాడే సాహసం చేయలేదు. తాజాగా.. గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను ఆస్పత్రి తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.

Also Read కరోనా లాక్ డౌన్: కన్న కొడుకు శవాన్ని కని, పెంచిన చేతులపైన్నే మోసుకెళ్లి.....

పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ కి చెందిన దేవదత్ రామ్ అనే వ్యక్తి భార్య స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా..  కంపెనీ కి సంబంధించిన వారే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

మెరుగైన వైద్యం కోసం తన భార్యను కంగ్వాల్ లోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఎవరిని అభ్యర్థించినా.. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక ఎవరి సహాయం అందక.. భార్యను సైకిల్ పై కూర్చొపెట్టుకొని దాదాపు 12కిలోమీటర్లు..దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తన బాధను అతను మీడియా ముందు వివరించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

click me!