ఏడు సెకన్లు పట్టదు.. బయటకొస్తే కాల్చిపడేస్తా: పోలీస్ అధికారి వార్నింగ్

By Siva Kodati  |  First Published Mar 27, 2020, 7:02 PM IST

ప్రభుత్వ ఆదేశాలను పాటించాలనో లేదంటే హీరోయిజం చూపించాలనో కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు


ప్రభుత్వ ఆదేశాలను పాటించాలనో లేదంటే హీరోయిజం చూపించాలనో కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్యపదజాలంతో దూషిస్తూ విమర్శల పాలవుతున్నారు.

ఏపీలోని పిడుగురాళ్లలో ఓ సీఐ ఇలాగే అత్యుత్సాహం చూపించి సస్పెన్షన్‌కు గురయ్యాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని నగరంలోని మహిద్‌పూర్ పోలీస్ స్టేషన్‌ హౌస్ అధికారి సంజయ్ వర్మ రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిపై ప్రతాపం చూపించాడు.

Latest Videos

Also Read:ఆపరేషన్ నమస్తే: కరోనాపై పోరుకు ఇండియా ఆర్మీ

తన మాట విని మీరంతా ఇళ్లలో ఉండండి. తన మాట కాదని రోడ్ల మీదకు వస్తే కాల్చి చంపుతానని బెదిరించాడు. తాను షార్ప్ షూటర్‌నని, తుపాకీతో గురి చూసి కాల్చడానికి తనకు ఏడు సెకన్లకు మించి సమయం పట్టదన్నాడు.

అంతేకాకుండా షూటింగ్‌లో తాను రజత పతకం గెలుచుకున్నానని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని స్థానికులను తీవ్రంగా హెచ్చరిస్తూ మరో మెసేజ్ పెట్టారు. అంతేకాకుండా తన సందేశాన్ని వాట్సాప్ ఫార్వార్డ్ చేయాలని సూచించాడు.

Also Read:ప్రియురాలిని చూడాలని క్వారంటైన్ నుంచి పరార్: లవర్‌‌ని కూడా బుక్ చేశాడు

ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి  వెళ్లడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. సంజయ్‌ను పోలీస్‌ లైన్‌కు అటాచ్ చేస్తూ ఉజ్జయిని ఎస్పీ సచిన్ అతుల్‌కర్ ఆదేశించారు. కాగా గురువారం 65 ఏళ్ల వ్యక్తి మరణించడంతో మధ్యప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరింది. 

click me!