కరోనాతో మరణిస్తే అది వెంటనే సెటిల్ చేయాలి: లైఫ్ ఇన్సూరెన్స్..

By Sandra Ashok Kumar  |  First Published Apr 7, 2020, 10:38 AM IST

ప్రస్తుతం కరోనా వైరస్ సోకి మరణించిన వారి బీమా పాలసీలపై క్లయిమ్‌లకు ‘ఫోర్స్ మెజర్’ రూల్ అమలు చేయొద్దని బీమా సంస్థలను జీవిత బీమా మండలి కోరింది. త్వరితగతిన ఆ క్లయిమ్‌లు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. 
 


న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించిన వారి క్లయిమ్‌లను అత్యంత వేగంగా పరిష్కరించాలని దేశంలోని అన్ని భీమా సంస్థలను జీవిత బీమా మండలి కోరింది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బీమా సంస్థలు సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. 

కొవిడ్-19 మరణాల క్లెయిమ్‌లకు ‘ఫోర్స్ మెజర్ (Force Majerue)’ నిబంధన వర్తించదని జీవిత బీమా మండలి తెలిపింది. బీమా క్లెయిమ్‌ల్లో ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్ మెజర్’ నిబంధనను అమలు చేస్తారు. 

Latest Videos

కరోనా మరణాలకు ‘ఫోర్స్ మెజర్’ నిబంధనను అమలు చేయడం లేదని జీవిత బీమా మండలి తెలిపింది. దీనిపై స్పష్టత కోసం ఎంతో మంది వినియోగదారులు బీమా సంస్థల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేసింది. 

‘ఫోర్స్ మెజర్’ నిబంధనపై వివాదాలు, వదంతులకు తావే లేదని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది. ఈ సంగతిని తమ వినియోగదారులకు బీమా సంస్థలు వ్యక్తిగతంగా తెలియజేయలాని జీవిత బీమా మండలి ఆదేశించింది. 

also read లాక్‌డౌన్ ఎఫెక్ట్: తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు...కానీ వాటికి పెరిగిన డిమాండ్...

జీవిత బీమా మండలి సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ భట్టాచార్య స్పందిస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరంగా వ్యాపించిన కొవిడ్-19 మహమ్మారి ఇంటిలో ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ప్రాథమిక అవసరం అని నొక్కి చెబుతోంది’ అని చెప్పారు.

‘లాక్ డౌన్ వల్ల వినియోగదారులకు కలిగిన అంతరాయాన్ని తగ్గించడానికి జీవిత బీమా రంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ సంక్లిష్ట సమయంలో కొవిడ్-19 డెత్ క్లెయిమ్‌లు సహా ఎన్నో సేవలను డిజిటల్ రూపంలో అందజేస్తున్నాం’ అని జీవిత బీమా మండలి సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ భట్టాచార్య వెల్లడించారు.

‘ఈ కష్ట కాలంలో బీమా సంస్థలన్నీ వినియోగదారులకు అండగా నిలవాలి. తప్పుడు సమాచారానికి తావులేకుండా చూడాలి అని అన్నారు.’ అని జీవిత బీమా మండలి సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ భట్టాచార్య అన్నారు. ఏప్రిల్ నెలలో జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపుల కోసం వినియోగదారులకు మరో 30 రోజుల అదనపు సమయం ఇస్తున్నట్లు ఐఆర్డీఏఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. 
 

click me!