ఉద్యోగులే కంపెనీలకు చెప్పాలి.. వాటిపై స్పష్టత ఇవ్వాలి...

By Sandra Ashok Kumar  |  First Published Apr 14, 2020, 11:38 AM IST
ఐటీ రిటర్న్స్ దాఖలు, టీడీఎస్ అమలు అంశాలపై ఉద్యోగులే తమకు పాత ఐటీ విధానం కావాలా? కొత్త పాలసీ కావాలా? అన్న సంగతిని సంస్థలకు ఉద్యోగులే తెలుపాలని సీబీడీటీ పేర్కొంది. ఉద్యోగుల ఆప్షన్‌కు అనుగుణంగా సంస్థల యాజమాన్యాలు టీడీఎస్ వర్తించే ఉద్యోగులకు ఆ విధానాన్ని అమలు చేస్తాయని ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. 
 

న్యూఢిల్లీ: కొత్త ఆదాయం పన్ను పథకంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పన్ను రాయితీ ఉండే ఈ కొత్త పథకంలోకి మారుతారా? లేక పాత పథకంలోనే ఉంటారా? అనే విషయాన్ని ఉద్యోగులే తమ యాజమాన్యాలకు తెలపాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉద్యోగులు ఏ పద్దతిలో కొనసాగాలన్న విషయాన్ని కంపెనీల యాజమాన్యాలకు తెలిపితే.. మూలంలో పన్ను కోత (టీడీఎస్‌) వర్తించే ఉద్యోగులకు యాజమాన్యాలు ఆ ప్రకారం టీడీఎస్‌ అమలు చేస్తాయని తెలిపింది.

ఎలాంటి పన్ను రాయితీలు, మినహాయింపులు వినియోగించుకోని ఉద్యోగులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌) కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సంవత్సర బడ్జెట్‌లో తక్కువ పన్ను పోటుతో కొత్త పన్ను చెల్లింపు పథకం ప్రవేశపెట్టారు. అయితే దీని అమలు ఎలా అనే దానిపై సందేహాలు తలెత్తడంతో సీబీడీటీ ఈ స్పష్టత ఇచ్చింది. 

also read  లాక్‌డౌన్లో క్రియేటివిటీ: ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ చేయనున్న ‘స్విగ్గీ’

ముందు కొత్త పన్ను పథకాన్ని ఎంచుకున్నా, రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఉద్యోగి ఆప్షన్‌ మార్చుకోవచ్చని కూడా సీబీడీటీ తెలిపింది. అప్పుడు అవసరాన్ని బట్టి టీడీఎస్‌ను సర్దుబాటు చేస్తారు. 

జీఎస్టీ, కస్టమ్స్‌ రీఫండ్స్‌ కోసం అప్లయ్‌ చేసే సంస్థలకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) శుభ వార్త చెప్పింది. రుజువుల కోసం ఇలాంటి సంస్థల నుంచి ఫిజికల్‌ డాక్యుమెంట్లు అడగవద్దని క్షేత్ర స్థాయి అధికారులను కోరింది. ఈ నెల్లో దాదాపు రూ.18,000 రీఫండ్స్‌ బదిలీ చేసేందుకు సీబీఐసీ ‘స్పెషల్‌ రీఫండ్‌ అండ్‌ డ్రాబ్యాక్‌ డిస్పోజల్‌ డ్రైవ్‌’ పేరుతో సీబీఐసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 
click me!