కరోనా వైరస్ సోకిన రోగులను చికిత్స చేస్తున్న వైద్యులకు కరోనా పరీక్షల టెస్టింగ్ కిట్స్ తో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ను తయారు చేస్తుంది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులను చికిత్స చేస్తున్న వైద్యులకు కరోనా పరీక్షల టెస్టింగ్ కిట్స్ తో పాటు వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ను తయారు చేస్తుంది.
రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో పాటు ఇతరులకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ను తయారు చేయనున్నారు. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారు ఈ వ్యాధి బారినపడకుండా ఈ కిట్స్ దోహదం చేయనున్నాయి.
ఈ మేరకు గురువారం నాడు డిఆర్‌డిఓ ఓ ప్రకటన విడుదల చేసింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ తయారీలో డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని ఆ ప్రకటన తెలిపింది.
ఈ సూట్ తయారీ సమయంలో టెక్స్ టైల్స్ పారామీటర్స్ కు లోబడి అన్ని పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపింది. ఈ సూట్ వేసుకొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా డిఆర్‌డిఓ ప్రకటించింది.
Also read:ఎయిమ్స్ డాక్టర్ భార్యకు కూడ కరోనా, ఆమె గర్భవతి
కరోనా వైరస్ రక్షణలో ముందున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బంది రక్షణ కోసం పెద్ద సంఖ్యలో ఈ సూట్లను తయారు చేయనున్నట్టుగా ఆ సంస్థ తేల్చి చెప్పింది. రెండు ప్రైవేట్ కంపెనీలను కూడ ఈ సూట్ల తయారీలో భాగస్వామిగా చేశారు.
నేవీ కూడ స్క్రీనింగ్ చేసేందుకు పరికరాన్ని తయారు చేసింది. ముంబైలోని నావల్ డాక్ యార్డులో పెద్ద ఎత్తున పరీక్షించేందుకు గాను దీన్ని తయారు చేశారు. ఈ విషయాన్ని నేవీ మరొక ప్రకటనలో తెలిపింది.