కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తమ సొంత రాష్ట్రానికి వలస వెళుతున్నారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తమ సొంత రాష్ట్రానికి వలస వెళుతున్నారు.
దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై సీరియస్ అయింది. వారిని ఎక్కడికక్కడే నిలిపివేయాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. వలస కార్మికులు ఎక్కడికి వెళ్లవద్దని, ఉన్నచోటే ఆగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Also Read:ఏప్రిల్ 7లోగా తెలంగాణ కరోనా ఫ్రీ: గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
సరైన వసతి సౌకర్యాలతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తామని, అవసరమైతే అద్దె చెల్లించేందుకు సిద్ధమేనని కేజ్రీవాల్ వెల్లడించారు. ఇంటి బాట పట్టి వారి కుటుంబీకులతో పాటు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దన్నారు.
సొంత ఇళ్ల యజమానులు అద్దె కట్టమంటూ టెనెంట్లను బలవంతం చేయొద్దని సీఎం కోరారు. ఎవరికైనా అద్దె చెల్లించలేని పరిస్ధితి వుంటే, ప్రభుత్వమే అద్దె కూడా చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
సంక్షోభ సమయంలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు సైతం తమపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులు పస్తులుండకుండా చూడాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం పెద్ద సంఖ్యలో వలసకార్మికులు తరలిపోతున్న దృశ్యాలు చూశానని, ఇంత భారీగా జన సమూహాల్లో ఒక్కరు కరోనా బారిన పడినా, అది మిగతా వాళ్లకు విస్తరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:కరోనా వైరస్ పోలిన హెల్మెట్: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం
ప్రధాని మోడీ లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఏం చెప్పారు. ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాలన్నారు. లాక్‌డౌన్ ముఖ్యోద్ధేశం ఇదే. దీనిని మనం పాటించకపోతే కరోనాతో పోరాడుతున్న భారతదేశం ఓటమిని చవిచూడక తప్పదని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ ప్రభుత్వం ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రజలకు లంచ్, డిన్నర్ అందిస్తోందని, ఢిల్లీలో ప్రతి ఒక్కరికి తిండి దొరికేందుకు పూర్తి శక్తియుక్తులతో పనిచేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.