కరోనా వైరస్ పోలిన హెల్మెట్‌: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం

By narsimha lodeFirst Published Mar 29, 2020, 4:38 PM IST
Highlights

:కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్లపైకి వచ్చిన ప్రజలకు కరోనా వైరస్ గురించి వివరిస్తున్నారు. కరోనా వైరస్ ను పోలిన హెల్మెట్ ను ధరించిన ఓ పోలీస్ అధికారి కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
 

చెన్నై:కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్లపైకి వచ్చిన ప్రజలకు కరోనా వైరస్ గురించి వివరిస్తున్నారు. కరోనా వైరస్ ను పోలిన హెల్మెట్ ను ధరించిన ఓ పోలీస్ అధికారి కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు.

కరోనాను పురస్కరించుకొని ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కూడ రోడ్లపై ప్రజలు వస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు పేరు చెప్పి ఇతర కారణాలు చెప్పి ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లపై ప్రజలు రాకుండా ఉండేందుకు వీలుగా చెన్నై పోలీసులు కరోనా వైరస్ పోలిన హెల్మెట్ ను తయారు చేశారు.

also read:వలస కార్మికుల ఇళ్లకు నీళ్లు, విద్యుత్ నిలిపివేత: ఢిల్లీపై యూపీ సర్కార్ విమర్శలు

ఈ హెల్మెట్ ను పెట్టుకొన్న పోలీసు అధికారి రోడ్లపైకి వచ్చే ప్రజలకు కరోనా వైరస్ వల్ల ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో వివరించారు. ఇంటి వద్దే ఉండడం వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయో కూడ ఆయన ప్రజల్లో అవగాహన కల్పించారు.

కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో ప్రజలకు పోలీసులు వివరించారు. అందుకే ఈ హెల్మెట్ ను ధరించిన పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకొన్నారు. 

కాగితంతో కరోనా వైరస్ ను పోలినట్టుగా కలర్ పుల్ గా ఈ హెల్మెట్ ను తయారు చేయించారు పోలీసులు. రాజేష్ బాబు అనే ఇన్స్‌పెక్టర్ ఈ హెల్మెట్ ధరించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నించారు. 

చెన్నై పోలీసులు తీసుకొన్న ఈ చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.పోలీసులు తీసుకొన్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందించారు. 
 

click me!