దేశానికి అండగా నిలిచేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగంలోకి దిగింది. సులభంగా వినియోగించే విధంగా వెంటిలేటర్ల, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి సహకరించనుంది.
భారతదేశంలోకి కరోనా వైరస్ నిదానంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 1000 కేసులు నమోదు కాగా, 25 మంది వరకు మరణించారు. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశానికి అండగా నిలిచేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగంలోకి దిగింది. సులభంగా వినియోగించే విధంగా వెంటిలేటర్ల, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి సహకరించనుంది. ఈ విషయాన్ని ఇస్రో డైరెక్టర్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.
Also Read:కరోనా వైరస్ పోలిన హెల్మెట్: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం
ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోని ఏ వ్యక్తి కూడా కోవిడ్ 19 బారిన పడలేదని ఆయన స్పష్టం చేశారు. వెంటిలేటర్‌ను కేవలం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిజైన్ మాత్రమే చేస్తుందని, దాని తయారీని మాత్రం పరిశ్రమలే తీసుకోవాలని ఆయన కోరారు.
తాము దాదాపు 1,000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశామని, అలాగే ఇస్రో ఉద్యోగులు మాస్కులను తయారు చేస్తున్నారని సోమనాథ్ చెప్పారు. తమ కమ్యూనికేషన్స్ కంప్యూటర్లు అత్యంత శక్తివంతమైనవని ఆయన తెలిపారు.
Also Read:కరోనాపై గెలుపుకు కఠిన నిర్ణయాలు, పేదలకు క్షమాపణ: మన్‌కీ బాత్‌లో మోడీ
అవసరమైతే ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తారని, కావాలనుకున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెడతామని సోమనాథ్ అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతానికి రాకెట్ల తయారినీ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. జీఎస్ఎల్‌వీ ఎఫ్10 ప్రయోగానికి సంబంధించిన రాకెట్లను కూడా లాంచ్ ప్యాడ్స్ నుంచి అసెంబ్లీంగ్ బిల్డింగ్‌కు తరలించారు.