కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్ నుంచి నగ్నంగా బయటకు పరుగులు...

By telugu news team  |  First Published Mar 28, 2020, 3:39 PM IST

శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి  నగ్నంగా బయటికి  పరుగులు తీశాడు. అనంతరం  అతగాడు  ఆరు బయట నిద్రిస్తున్న వృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. 


కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగి పోతోంది. ముందుగానే స్పందించి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే.. తమినాడు  లో ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి బయటకు నగ్నంగా పరుగులు తీసి అందరిని కలవరపెట్టాడు.

Also Read బంధువులొస్తే కరోనా వస్తదేమో.. నాలుగు నిమిషాల్లో పెళ్లి...

Latest Videos

పూర్తి వివరాల్లోకి... శ్రీలంక నుంచి తమిళనాడులోని థేని జిల్లాకు వచ్చిన వ్యక్తిని ముందు జాగ్రత్తగా అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. అయితే శుక్రవారం రాత్రి నిర్బంధంలోంచి  నగ్నంగా బయటికి  పరుగులు తీశాడు. అనంతరం  అతగాడు  ఆరు బయట నిద్రిస్తున్న వృద్దురాలిపై దాడి చేసి, ఆమె గొంతు కొరికాడు. 

దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు  అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వృద్దురాలిని ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. థేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. 

దీంతో స్థానికంగా ఈ ప్రాంతంలో ఆందోళన చెలరేగింది. అయితే గతవారం విదేశాలనుంచి తిరిగి వచ్చిన అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది. 

click me!