బిడ్డ డెలివరీకన్నా ముందే కరోనా టెస్టు కిట్ ను దేశానికి డెలివరీ చేసిన సైంటిస్ట్

By Sree sFirst Published Mar 28, 2020, 3:34 PM IST
Highlights

భారత్ కు చెందిన ఒక కంపెనీ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు టెస్ట్ కిట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కో టెస్టు కిట్ ధర 1,200 రూపాయలు. దానితోపాటుగా ఒక్కో టెస్టు కిట్ తో 100 సాంపిల్స్ ని టెస్టు చేయవచ్చు

కరోనా రక్కసి భారతదేశంపై కోరలు చాస్తున్నవేళ, ఈ మహమ్మారిని పారద్రోలడానికి ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ విధించారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ నడుస్తుండగానే సాధ్యమైనంత మందిని టెస్ట్ చేసి లక్షణాలున్నవారిని ఐసొలేషన్ కి తరలించాలి. 

ఈ నేపథ్యంలోనే భారత్ విదేశాల నుంచి టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. ఒక్కో టెస్టు కిట్ ధర సుమారుగా 4,500 రూపాయలు. పరీక్ష ఫలితం రావాలన్న కూడా 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. 

ఈ పరిస్థితుల్లో భారత్ కు చెందిన ఒక కంపెనీ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు టెస్ట్ కిట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కో టెస్టు కిట్ ధర 1,200 రూపాయలు. దానితోపాటుగా ఒక్కో టెస్టు కిట్ తో 100 సాంపిల్స్ ని టెస్టు చేయవచ్చు. పూణే కి చెందిన మైలాబ్ డయాగ్నస్టిక్స్ వీటిని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే ఈ కిట్లను పూణే, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులకు కూడా ఎగుమతి చేసారు. 

Also Read వియత్నాంను చూసి నేర్చుకోవాలి.. చిన్నదేశమైనా..కరోనాని జయించింది...

ఇలా భారతీయ కంపెనీ ఇంత తక్కువకు తయారుచేయడం గొప్ప విషయమైతే... ఈ ప్రోడక్ట్ ని తయారు చేసింది 9 నెలల నిండు గర్భిణీ. ఈ కిట్ ను విజయవంతంగా అందించిన తరువాత ఒక రకంగా చెప్పాలంటే... ఆమె ఈ కిట్ ను డెలివరీ ఇచ్చి తాను డెలివరీకి వెళ్ళింది. 

ఆ కిట్ తయారు చేసింది ఎవరంటే.... 

ఆమె పేరు మినల్ దఖావే భోంస్లే. పూణెకి చెందిన ఈ వైరాలజిస్ట్ కేవలం ఆరు వారాల్లో తన టీం తో కలిసి తయారు చేసింది. మీనల్ మాట్లాడుతూ... తాను గర్భంతో ఉన్నప్పటికీ దేశంకోసం పని చేయాల్సిన సమయం ఇది అని అన్నారు. 10 మంది టీంతో కలిసి ఈ కిట్ ను రూపొందించారు ఆమె. సాధారణంగా ఇలాంటి కిట్ తయారుచేయడానికి మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది. 

కానీ మీనల్ తన టీంతో కలిసి కేవలం నెలన్నర సమయంలో తయారు చేయడంతో పాటుగా ప్రతిసారి ఫలితం ఒకే విధంగా వచ్చెనంతవరకు చాలా కరెక్ట్ గా తప్పుకు ఆస్కారం లేకుండా ఈ టెస్టు కిట్లను తాయారు చేసింది. 

కాన్పు కోసం వెళ్లే ముందు సాయంత్రం భారత ప్రభుత్వానికి ఈ టెస్టు కిట్లను తయారు చేయడానికి దరఖాస్తు చేసి వెళ్ళింది. అలా భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలో అత్యంత తక్కువ ధరకు ఈ టెస్టింగ్ కిట్లను అందించింది మీనల్. 

click me!