దేశంలో 3374కి చేరిన కరోనా కేసులు, 79 మంది మృతి: కేంద్రం

By narsimha lodeFirst Published Apr 5, 2020, 5:00 PM IST
Highlights

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కి చేరుకొందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 472 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాడు ప్రకటించింది.


న్యూఢిల్లీ:దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కి చేరుకొందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా 472 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాడు ప్రకటించింది.ఈ 3374 కేసుల్లో 3030 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారలు తెలిపారు. 

ఆదివారం నాడు సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 79 మంది మృతి చెందినట్టుగా ఆయన తెలిపారు. ఇందులో నిన్నటి నుండి ఇప్పటివరకు 11 మంది చనిపోయారని ఆయన వివరించారు. 

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 267 మంది కోలుకొన్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. నాలుగు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య  జాయింట్ సెక్రటరీ తెలిపారు.

also read:ఆలస్యంగా కరోనా లక్షణాలు: 111 మందిని కలిసిన వ్యక్తి.....

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.ఐసోలేషన్ వార్డుల గురించి ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని లవ్ అగర్వాల్  ప్రకటించారు.

కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 292 మందిని ఇవాళ అరెస్ట్ చేసినట్టుగా కేంద్రం తెలిపింది. మరో వైపు 129 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామన్నారు.  దేశంలోని 13.6 లక్షల కార్మికులకు ఆహారం, ఆశ్రయం కల్పించినట్టుగా కేంద్రం ప్రకటించింది.

click me!