భారతీయ విమానాలకు దారి, అడుగడుగునా సాయం: ఎయిరిండియాపై పాకిస్తాన్ ఏటీసీ ప్రశంసలు

By Siva Kodati  |  First Published Apr 5, 2020, 3:13 PM IST

భారత్- పాకిస్తాన్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే. భారతదేశమన్నా.. భారతీయులన్నా పాకిస్తానీయులకు గిట్టదు. అలాంటి దేశం భారతదేశంపై ప్రశంసలు కురిపించింది. 


భారత్- పాకిస్తాన్ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే. భారతదేశమన్నా.. భారతీయులన్నా పాకిస్తానీయులకు గిట్టదు. అలాంటి దేశం భారతదేశంపై ప్రశంసలు కురిపించింది.

వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్మనీకి విమానాలు నడిపిన ఎయిరిండియాను పాకిస్తాన్ ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ప్రశంసించారు.

Latest Videos

లాక్‌డౌన్ కారణంగా మనదేశంలో చిక్కుకుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్‌ పౌరులను తరలించేందుకు, ఆయా దేశాల నుంచి కరోనా రిలీఫ్ మెటీరియల్స్‌ను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా పలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది సంగతి తెలిసిందే.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: తండ్రికి గుండెపోటు.. ముంబై నుంచి కాశ్మీర్‌కు సైకిల్‌పై ప్రయాణం

అయితే ఏప్రిల్ 2న రెండు ఎయిరిండియా విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్తుండగా, వాటికి అనుమతివ్వడంతో పాటు ‘‘ఆస్ సలాం ఆలేకూం (మీకు శాంతి కలుగుతుంది). ఇది కరాచీ కంట్రోల్ రూమ్.. ఎయిరిండియా రిలీఫ్ ఫ్లైట్లకు స్వాగతం అని చెప్పడం ఆనందం, ఆశ్చర్యం కలిగించిందని ఎయిరిండియా పైలట్ పాకిస్తాన్ ఏటీసీ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.

తొలుత పాకిస్తాన్ ఏటీసీ సిబ్బందిని సంప్రదిస్తే, ఎలాంటి స్పందన రాలేదని.. అనంతరం వారు తమను సంప్రదించి గొప్పగా రిసీవ్ చేసుకున్నారని పైలట్ చెప్పుకొచ్చారు. మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవలపట్ల గర్వంగా ఉంది.. గుడ్ లక్ అని పాక్ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు.

పాకిస్తాన్ అనుమతితో కరాచీ గుండా వెళ్లిన ఎయిరిండియా విమానాలకు 15 నిమిషాల సమయం కలిసి వచ్చింది. అంది మాత్రమే కాకుండా ఇరాన్ గగనతలంలోకి వెళ్లేముందు ఆ దేశ వైమానిక సిబ్బందిని సంప్రదించడంలో ఇబ్బందులు తలెత్తితే పాక్ ఏటీసీ సాయం చేసింది.

Also Read:కరోనా: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్

దీంతో ఇరాన్ కూడా తమకు మార్గం చూపించిందని ఎయిరిండియా పైలట్ గుర్తుచేసుకున్నారు. ఇక ఎయిరిండియా సేవలపై అటు టర్కీ, జర్మనీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా ప్రశంసలు కురిపించాయి.

మనదేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ పౌరులను తరలించేందుకు 18 విమానాలను నడుపుతున్నట్లు ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!