మార్చి 23నే మర్కజ్ నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక, వీడియో విడుదల

By narsimha lode  |  First Published Apr 1, 2020, 2:06 PM IST

లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఢిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మర్కజ్  నిర్వాహకులను హెచ్చరించారు. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోను ఈ నెల 23వ తేదీన రికార్డు చేసినట్టుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.



న్యూఢిల్లీ:లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఢిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మర్కజ్  నిర్వాహకులను హెచ్చరించారు. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోను ఈ నెల 23వ తేదీన రికార్డు చేసినట్టుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

మర్కజ్ లో ఉన్న వారిలో సుమారు 24 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం నాడు ఉదయమే ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest Videos

కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మర్కజ్ లో మత ప్రార్థనలు నిర్వహించిన వారిని స్థానిక పోలీసులు హెచ్చరించారు

 ఈ మేరకు వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసినా కూడ నిర్వాహకులు పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఢిల్లీ ఈవెంట్ కూడ ప్రధాన కారణమైందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

also read:డాక్టర్‌కు కరోనా పాజటివ్: ఢిల్లీలో ఆసుపత్రి మూసివేత

నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో దేశంలోని పలు రాష్ట్రాల నుండి వందలాది మంది హాజరయ్యారు.  

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి నుండే దేశంలో కరోనా పాజిటివ్ లక్షణాలు వ్యాప్తి చెందినట్టుగా ప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కారణమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.నిజుముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనల్లో పాల్గోని వచ్చిన వారిలో  తెలంగాణ రాష్ట్రంలో నలుగురు మృతిచెందారు. 

click me!