కరోనా వైరస్‌తో ఆయా దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటం, వైద్య సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక దీపంలా కనిపించింది
కరోనా వైరస్‌తో ఆయా దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటం, వైద్య సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్న తరుణంలో వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక దీపంలా కనిపించింది.
ఈ మందు ప్రపంచంలో భారత్ దగ్గరే ఉండటంతో అన్ని దేశాలు మన వద్దకు క్యూ కడుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది. కోవిడ్ 19 నివారణకు గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైడ్రాక్సీక్వోరోక్విన్‌ను తమకు సరఫరా చేయాలని ఆ దేశాధ్యక్షుడు జేర్ బోల్సోనారో భారత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
Also Read:కష్టపడి సాధించిన ట్రోఫీలను అమ్మేసి: పీఎం కేర్స్‌కు విరాళం
పనిలో పనిగా మోడీని హనుమంతుడిగా పోల్చారు. నాడు రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు.
అనారోగ్యంతో ఉన్నవారిని యేసు క్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయుక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్ధనను అంగీకరించాలని బోల్సోనారో కోరారు. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తానని ఆయన లేఖలో ప్రస్తావించారు.
మలేరియాకు మందుగా పనిచేసే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కరోనాకు చక్కగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక మంది ప్రముఖులు చెప్పడంతో ఒక్కసారిగా దీనికి డిమాండ్ పెరిగింది.
Also Read:లాక్ డౌన్ ముగింపా..?కొనసాగింపా..? తేలేది ఆ రోజే..
ప్రపంచంలోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసేది భారత్ ఒక్కటే కావడంతో ప్రపంచం మొత్తం మనపైనే ఆశలు పెట్టుకున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను తమకు సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
ఇదే సమయంలో అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో భారత్‌కు అవసరమైనంత మేర నిల్వలు ఉంచుకుని మిగిలిన స్టాక్‌ను అవసరమైన దేశాలకు సరఫరా చేయాలని మోడీ నిర్ణయించారు. ఈ మేరకు ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించి మార్గం సుగమమం చేశారు.