అందుకోసం వారికి ప్లేట్లకు బదులు అరటి ఆకులలో అందిస్తున్నాము: ఆనంద్ మహీంద్రా

By Sandra Ashok KumarFirst Published Apr 10, 2020, 7:04 PM IST
Highlights

కరోనా వైరుస్ వ్యాప్తి కారణంగా దేశంలో లక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తమ ఫ్యాక్టరీ కాంటీన్ లో  ప్లేట్లకు బదులు వాటిని అరటి ఆకులతో భర్తీ చేస్తూ ఆహారాన్ని అందిస్తున్నాము అని ఆనంద్ మహీంద్రా వివరించారు

ప్రముఖ వ్యాపారవేత్త  ఆనంద్ మహీంద్రా తన "ప్రోయాక్టివ్" ఫ్యాక్టరీలోని బృందాలు ఫ్యాక్టరీ కాంటీన్ లో ప్లేట్లకు బదులు వాటిని అరటి ఆకులతో భర్తీ చేయాలి అనే ఆలోచనపై తక్షణమే పనిచేశాయని తరువాత క్యాంటీన్లలో అరటి ఆకులతో ప్లేట్లను భర్తీ చేశాయని చెప్పారు.


న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఫ్యాక్టరీలో పని చేస కార్మికులకు కరోనా వైరస్ సొకాకుండా ముందు జాగ్రత్తకు ఒక  స్థిరమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

అదేంటంటే తమ కంపెనీ క్యాంటీన్ లో ప్లేట్లకు బదులుగా, ఇప్పుడు మహీంద్రా గ్రూప్ ఫ్యాక్టరీ క్యాంటీన్లలో అరటి ఆకులలో ఆహారం అందిస్తున్నారు. ఇది రిటైర్డ్ జర్నలిస్ట్ పద్మ రామ్‌నాథ్ నుండి వచ్చిన ఒక  ఇమెయిల్‌తో ప్రారంభమయ్యాయి అని మిస్టర్ఆనంద్ మహీంద్రా అన్నారు.


ప్లేట్లకు బదులుగా అరటి ఆకులలో ఆహారం అందించడం అనేది అరటి తోట రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం దేశంలో 21 రోజుల లాక్ డౌన్ రోజువారీ వేతన జీవులు, రైతులపై తీవ్రంగా ప్రభావితం చేసింది.

also read కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో భారీగా తగ్గిన చమురు వినియోగం... పరిస్థితి ఇలాగే కోనసాగితే...?


ఆనంద్ మహీంద్రా తన "ప్రోయాక్టివ్" ఫ్యాక్టరీలోని బృందాలు ఈ కొత్త ఆలోచనపై తక్షణమే పనిచేశాయని, అందుకోసం వారి క్యాంటీన్లలో అరటి ఆకులతో ప్లేట్లను భర్తీ చేశారని చెప్పారు.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన తరువాత

అతని ట్వీట్ కు కేవలం ఒక  గంటలో 13వేల లైక్స్ వచ్చాయి. ఆనంద్ మహీంద్రా చేసిన ట్విట్టర్ పోస్టులో తన కంపెనీ కార్మికులు అరటి ఆకులలో తినే ఫోటోలను కూడా షేర్  చేశారు.ఆరటి ఆకులు సప్లయి చేసే చిన్న వ్యాపారాలకు సహాయం చేసినందుకు ఆనంద్ మహీంద్రను ట్విట్టర్‌లో ప్రజలు ప్రశంసించారు.


ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్త  లాక్ డౌన్ తో భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న వ్యాపారాలు నశించిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సహాయం చేసే ప్రయత్నాలను వేగవంతం చేస్తూ అలాగే ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నాటికి దేశంలో 5,000 కరోనావైరస్ కేసులు ఇంకా 166 కరోనా మరణాలు నమోదయ్యాయి.

click me!