కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో భారీగా తగ్గిన చమురు వినియోగం... పరిస్థితి ఇలాగే కోనసాగితే...?

By Sandra Ashok Kumar  |  First Published Apr 10, 2020, 3:46 PM IST

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్‌తో భారత దేశంలో చమురు వినియోగం 70 శాతం పడిపోయిందని అంచనా వేశాయి కేంద్ర చమురు సంస్థలు. ఇది అత్యంత విపత్కర పరిస్థితి అని ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.


న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల వివిధ వ్యవస్థలు స్తంభించిపోయాయి. 130 కోట్ల మందికి పైగా గల జనాభా అంతా ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా మారాయి. '

విమాన, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్తలు మూగబోయాయి. భారీ స్థాయిలో చమురు వినియోగించే దేశంలో ఓసారి దాని డిమాండ్ పతనమైంది. దీంతో చమురు శుద్ధి సంస్థలతోపాటు చమురు ఉత్పత్తి సంస్థలపైనా దీని ప్రభావం భారీగానే పడింది.

Latest Videos

70 శాతం చమురు డిమాండ్ తగ్గిందని అంచనాలు
లాక్ డౌన్ కాలంలో దాదాపు 70 శాతం డిమాండ్ పడిపోయిందని దేశీయ ముడి చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. చైనా, అమెరికా తర్వాత అత్యధిక స్థాయిలో చమురును వినియోగిస్తూ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది. మొత్తం చమురులో కేవలం ఈ మూడు దేశాల వినియోగమే 40 శాతం. 

చమురు సంస్థల నేల చూపులు ఇలా
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో భారతదేశంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చమురు సంస్థలు నేల చూపులు చూస్తున్నాయి. ఈనెల మొత్తం వినియోగం.. గతేడాది ఏప్రిల్ నెలలో ఇదే సమయంలో వాకడంతో పోలిస్తే 50 శాతానికంటే తక్కువకు పడిపోయినట్లు చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గుదల
దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, వస్తు సేవలు నిలిచిపోవడంతో సుమారు 60 శాతం పెట్రోల్, 40 శాతం డీజిల్ వినియోగానికి డిమాండ్ పడిపోయింది. కేవలం ఎల్పీజీ వంట గ్యాస్ మాత్రమే డిమాండ్ కు సరిపడా సరఫరా అవుతున్నది. ప్రపంచ మార్కెట్ అంచనాల ప్రకరాం ప్రతి రోజు సుమారు కొన్ని లక్షల బ్యారెళ్ల చమురు డిమాండ్ పడిపోయింది. ఒక మనదేశంలోనే 30 లక్షల బ్యారెళ్ల ఆయిల్ డిమాండ్ తగ్గినట్లు అంచనా. 

also read చిక్కినా సక్కనోడే మన ముకేశ్ అంబానీ...ఆయన సంపద విలువ...

భారత్‌లో 44 లక్షల బ్యారెళ్ల నుంచి 14 లక్షల బారెళ్లకు పతనం
2019 లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి రోజూ 44 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగిస్తారు. దీనిలో దాదాపు ఏడు లక్షల బ్యారెళ్ల పెట్రోల్, 18 లక్షల బారెళ్ల డీజిల్ భారతదేశంలో వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ చమురు ఉత్పత్తి సంస్థలు, చమురు శుద్ధి సంస్థల మధ్య సందిగ్ధత ఏర్పడింది.

అత్యంత విపత్కర పరిస్థితులన్న ఓఎన్జీసీ మాజీ చైర్మన్
ఇటువంటి విపత్కర పరిస్థితులను తమ జీవితంలోనే చూడలేదని దేశంలోకెల్లా అతిపెద్ద ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మున్ముందు మరింత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

చమురు ఉత్పత్తిపై సమీక్షించాల్సిన అవసరం ఉందంటున్న అధికారులు
ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ స్థాయితో పోలిస్తే 30 నుంచి 40 శాతం వరకు డిమాండ్ మాత్రమే తగ్గిపోవడంతో  చమురు శుద్ది సంస్థలు, ఆయా ఉత్పత్తి సంస్థలతో దిగుమతుల ఒప్పందాలపై పున: సమీక్షించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడానికి అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థలతో చర్చిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారమే తెలిపారు. 

భారత్‌లో తగ్గిన డిమాండ్.. చైనాలో సాధారణ పరిస్థితులు
భారత్ అమలు చేస్తున్న 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయంతో చమురు సంస్థలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో తీవ్రత తగ్గినందున చమురు వినియోగం పెరుగనుండటం ఆయా సంస్థలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. 

రైల్వేలకు కష్టకాలం.. సరుకు రవాణాలో వెనుకంజ
కళకళలాడిన రైల్వేకు కష్టకాలం వచ్చింది. కరోనా వైరస్‌ దెబ్బకు గత ఆర్థిక సంవత్సరంలో 1,209 మిలియన్‌ టన్నుల సరుకు మాత్రమే చేరవేసింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 14 మిలియన్‌ టన్నులు తక్కువ. గత 40 ఏళ్లలో ఇలా తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత నెలలో వ్యాగెన్ల సంఖ్య రోజుకు 61 వేల నుంచి 34 వేలకు పడిపోయింది. 

రోడ్డుపైనే నిలిచిపోయిన రూ.35 వేల కోట్ల సరుకు
లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా రోడ్లపై నిలిచిపోయిన 3.5 లక్షల ట్రక్కుల్లో రూ.35 వేల కోట్ల విలువైన సరుకు నిలిచిపోయింది. వీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, ఎలక్ట్రికల్‌ పరికరాలు‌, పారిశ్రామిక ముడి సరుకులు ఉన్నాయి. ఇది ట్రక్కులకు, సరుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. 
 

click me!