జియోకు పోటీగా అమెజాన్ కొత్త సర్వీస్...‘లోకల్ షాప్స్’పేరుతో సరుకుల డెలివరీ

By Sandra Ashok KumarFirst Published Apr 25, 2020, 12:06 PM IST
Highlights

రిలయన్స్ జియో-వాట్సాప్ తలపెట్టిన జియోమార్ట్ ప్రాజెక్టుగా పోటీగా సరికొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది అమెజాన్. కిరాణా, ఇతర నిత్యావసరాల సరకుల హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ సర్వీస్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా అన్ని సేవలు నిలిచిపోయాయి. నిత్యావసరాలు అమ్మే దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కిరాణా, చిన్నస్థాయి వ్యాపారులు, రిటైల్​ వర్తకులకు అమెజాన్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది.

అమెజాన్ తన రిటైల్ వ్యాపారులను భాగస్వాములను చేయడానికి 'లోకల్​ షాప్స్​ ఆన్​ అమెజాన్​' అనే కార్యక్రమం ప్రారంభించింది. ఈ సర్వీసు సాయంతో తమ దుకాణాల్లోని సరకులను వినియోగదారులకు ఆన్​లైన్​లోనే అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది. 

ఇప్పటికే 5000 మంది వ్యాపారులను భాగస్వామ్యం చేసి ఆరునెలల పైలట్​ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇందుకోసం రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల్లోని రిటైల్ దుకాణాలపై అమెజాన్ కేంద్రీకరించింది. దుకాణదారుడు రెండు రోజుల్లో సరకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. 

also read  బంగారం ధరలు భగభగ...తులం రూ.82వేలు?!

ఆన్‌లైన్‌లో అమెజాన్ నుంచి వస్తువుల కోసం వ్యాపారులు దగ్గరల్లోని ప్రాంతాలనే ఎంచుకోవాలి. పిన్​కోడ్​ కీలకంగా తీసుకుంటారు. అమెజాన్​ డెలివరీ యాప్​ ద్వారా సరకు ట్రాకింగ్​, షిప్​మెంట్​ వివరాలు తెలుసుకునే వీలు ఉంటుంది. 

ఈ విధానం ద్వారా రిటైలర్లు, వర్తకులు తమ ఉత్పత్తులను స్థానికంగా సరఫరా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న డెలివరీ వ్యవస్థతో వినియోగ దారులకు వేగంగా సరకులు చేరవేయవచ్చని అమెజాన్ తెలిపింది​.

అమెజాన్ ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియో సారథ్యంలో పురుడు పోసుకుంటున్న జియో మార్ట్.. వాట్సాప్ సాయంతో కిరాణా సరుకులను ఆర్డర్​ తీసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది​. ఇది కిరాణా షాప్​ యజమానులు, చిన్న వ్యాపారాలకు లాభసాటిగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో తమ వ్యాపారం, వినియోగదారులను రక్షించుకునేందుకు అమెజాన్​ కూడా ముందడుగు వేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.

click me!