దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. చివరికి లాక్‌డౌన్‌ను ప్రకటించి ఎక్కడికక్కడ దిగ్బంధం చేశాయి. ప్రజలు ఇల్లు దాటి బయటకు రావాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు.
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. చివరికి లాక్‌డౌన్‌ను ప్రకటించి ఎక్కడికక్కడ దిగ్బంధం చేశాయి. ప్రజలు ఇల్లు దాటి బయటకు రావాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు.
21 రోజుల లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో పాటు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. అత్యవసర వాహనాలు, నిత్యావసర వస్తువుల వాహనాలకే అనుమతులు ఇస్తున్నారు.
Also Read:నిర్మలా సీతారామన్ ప్రకటన: కేంద్ర ప్రభుత్వ కరోనా ఆర్థిక ప్యాకేజీ ఇదీ...
రోడ్లపై వాహనాలు కనిపించకపోవడం, ఫ్యాక్టరీలు తయారీలు నిలిపివేయడంతో దేశంలో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. ఘజియాబాద్, నోయిడాలు దేశంలోనే అత్యంత రద్దీ గల మార్గంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటాయి. దీంతో ఇక్కడ విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడేది. దీనికి తోడు చుట్టుపక్కల వున్న ఫ్యాక్టరీల కారణంగా గాలిలో నాణ్యత అత్యంత తక్కువగా వున్న కేంద్రాలుగా ఈ రెండు నగరాలు గుర్తింపు తెచ్చుకున్నాయి.
Also Read:కరోనా లాక్ డౌన్: కారును ఆపినందుకు యువతీ హల్చల్, పోలీస్ చేయి కొరికి, రక్తం ఊసి... వీడియో వైరల్
ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఘజియాబాద్, నోయిడా నగరాల్లో వాయు కాలుష్యం తగ్గి గాలిలో నాణ్యత పెరిగింది. ప్రస్తుతం గాలి నాణ్యత సూచీ నోయిడాలో 76, ఘజియాబాద్‌లో 92గా నమోదైంది. మరికొద్దిరోజుల పాటు ఇదే వాతావరణం ఉండటంతో వాయు కాలుష్యం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.