కరోనా రోగులకు చికిత్స... కన్నీరు పెట్టుకున్న డాక్టర్

By telugu news team  |  First Published Apr 7, 2020, 7:36 AM IST

ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్-19 వార్డులో ఉన్న పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్ అంబిక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీడియా ముందు మాట్లాడుతూ ఏడ్చేశారు. 
 


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిపీడిస్తోంది. మన దేశంలోనూ వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించినా.. కేసులు పెరగడం మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

ఇప్పటి వరకు చాలా మంది కరోనా రోగుల గురించి మాత్రమే ఆలోచించారు. అయితే.. వారికి చికిత్స అందించే క్రమంలో తాము ఎదుర్కోంటున్న సమస్యలను కూడా కాస్త గుర్తించండి అంటూ ఓ యువ డాక్టర్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Latest Videos

Also Read ఇండియాలో 4067కి చేరిన కరోనా కేసులు,109 మంది మృతి: కేంద్రం...

ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్-19 వార్డులో ఉన్న పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్ అంబిక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మీడియా ముందు మాట్లాడుతూ ఏడ్చేశారు. 

‘దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ తరుణంలో మేము మా కుటుంబాలకు దూరంగా ఇక్కడ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మా కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లైతే మేమేం చేయగలం. వారికి చికిత్స చేయలేకపోతే మమ్మల్ని మేము జీవితంలో క్షమించుకోలేం’ అంటూ అంబిక కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇక్కడ ప్రాణాలతో పోరాడుతున్న వారికి తాము చికిత్స చేస్తున్నామని, అయితే తమకు అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ముఖ్యంగా కుటుంబసభ్యులు మద్దతు తమకు కొండంత బలాన్నిస్తుందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. నిజంగానే వైద్యులు చావుతో పోరాటం చేస్తున్నారు కదా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

click me!