కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటది, జాగ్రత్త: సీఎం హెచ్చరిక

By Sree sFirst Published Apr 6, 2020, 8:46 PM IST
Highlights

కేసీఆర్ తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. పేరు చెప్పకుండా ఒక పత్రికలో డాక్టర్లకు పిపిఈ కిట్లు లేవని రాసారని, డాక్టర్ల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేశారని ఆ వార్తాకథనంలో రాసారని చెప్పారు. 

కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న వేళ భారతదేశం గత్యంతతం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మోడీ గారు లాక్ డౌన్ ప్రకటించేనాటికన్నా ముందు నుంచే... జనతా కర్ఫ్యూ రోజునుంచే తెలంగాణలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. 

కరోనా పంజా విసరబోతుందనగానే కేసీఆర్ చాలా ముందుగానే మెలుకున్నారని చెప్పవచ్చు. తొలుత పారాసిటమాల్ వేస్తే పోతుందని చెప్పినప్పటికీ.... కానీ దాని ప్రభావాన్ని అంచనా వేసిన కేసీఆర్ ఒక లీడర్ లాగ ముందు నిలబడ్డారు. అన్ని తానై ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సక్సెస్ అయ్యారు. 

ఇక నేడు ఈ కరోనా విషయమై కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. పేరు చెప్పకుండా ఒక పత్రికలో డాక్టర్లకు పిపిఈ కిట్లు లేవని రాసారని, డాక్టర్ల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేశారని ఆ వార్తాకథనంలో రాసారని చెప్పారు. 

వాస్తవానికి ప్రభుత్వం వద్ద 45,000  పిపిఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 4 లక్షల కిట్లకు ఆర్డర్ పెట్టినట్టు కేసీఆర్ తెలిపారు. డాక్టర్ల బాధ్యత, రక్షణ ప్రభుత్వం కాకపోతే మీరు చూసుకుంటున్నారు అని ప్రశ్నించారు. 

వాస్తవానికి కేసీఆర్ ఎప్పటినుండో కూడా డాక్టర్లను మనం పరిరక్షించుకోవాలకని చెప్పడంతో పాటుగా వారికి రెస్ట్ కూడా సరైన మోతాదులో అందించాలని చెబుతున్నారు. ఈ విషయాన్నీ తెలంగాణ డాక్టర్లు మాత్రమే కాదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు కూడా మెచ్చుకుంటున్నారు. 

ఇలా తప్పుడు వార్తలు రాయడంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ఇలా తప్పుడు వార్తలు రాయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యం నిమాపాల్సింది పోయి ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం క్షమించరాని నేరం అని అన్నారు. 

చిల్లర రాజకీయాలు ఈ విపత్కర పరిస్థితి సమయంలో చేయడం సరికాదని, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అప్పుడు చూసుకుందామని అన్నారు. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, సమయం సందర్భం వచ్చినప్పుడు తీవ్ర సతాయిలో శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. 

వార్నింగ్ చివర్లో తన స్టైల్ లో కేసీఆర్ చెబితే ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని, అది ఖతర్నాక్ గా ఉంటుందని తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టులను హెచ్చరించారు. 

గీ టైమ్ లో దుర్మార్గం చేసేటోళ్లకు కరోనా తగలాలని నేను శాపం పెడుతున్నా...లోకం లోకమే ఆగమైతంటే శవాల మీద పేలాలు ఏరుకుండు ఏంది...ప్రజలను ఏకం చేసి ధైర్యం చెప్పెటోళ్లు గొప్పోల్లు... గిసువంటి చిల్లర మల్లరా త్రాస్టులు దరిద్రులు కాదు...అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.    

click me!