కరోనా: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్

By narsimha lodeFirst Published Apr 5, 2020, 1:59 PM IST
Highlights

: ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు హాజరై పోలీసుల కళ్లుగప్పి మలేషియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మందిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు హాజరై పోలీసుల కళ్లుగప్పి మలేషియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మందిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇండియాలో చిక్కుకొన్న మలేషియన్ల కోసం ఆ దేశం ఆదివారం నాడు ఇండియాకు విమానం పంపింది. ఇండియాలో చిక్కుకొన్న వారిలో మలేషియన్లతో కలిసి ఎనిమిది మంది మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొన్నవారు కూడ ఆ విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు.

మర్కజ్‌లో ప్రార్ధనల్లో పాల్గొనేందుకు వచ్చి లాక్ డౌన్ నిబంధనలతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీయులపై భారత ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే వారి వివరాలను సేకరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎయిర్ పోర్టులకు పంపింది.

అయితే నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మంది కూడ ఇతరులతో కలిసిపోయి విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా ఈ ఎనిమిది మందిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

also read:దేశంలో కరోనా ఈ వయస్సు వారికే ఎక్కువగా సోకుతుంది: కేంద్రం

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి మర్కజ్ కు లింకులు ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇక్కడ ప్రార్ధనల్లో పాల్గొన్నవారికి  విదేశీయుల నుండి కరోనా సోకినట్టుగా కేంద్రం గుర్తించింది. ఇక్కడి నుండి తమ గ్రామాలకు వెళ్లిన వారి కారణంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.
 

click me!