కరోనా చీకట్లపై యుద్ధం నేడే: ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9కి 9 నిమిషాలపాటు లైట్స్ ఆఫ్!

By Sree sFirst Published Apr 5, 2020, 12:15 PM IST
Highlights

లాక్ డౌన్ 12వ రోజున భారత ప్రజలు ప్రధాని పిలుపు మేరకు నేడు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి దీపాలను వెలిగించనున్నారు.

భారతదేశంలో లాక్ డౌన్ 12వ రోజున భారత ప్రజలు ప్రధాని పిలుపు మేరకు నేడు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి దీపాలను వెలిగించనున్నారు. అవి అందుబాటులో లేకపోతే... కొవ్వత్హులను కానీ, అవి కూడా లేకపోతే... మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లనైనా సరే ఆన్ చేసి సంఘీభావం తెలపనున్నారు.  

మొన్న శుక్రవారం రోజున ప్రధాని మాట్లాడుతూ... లాక్ డౌన్ పై పోరులో ఎవరు ఒంటరి కాదని, 130 కోట్ల మంది భారతీయులు ఈ కరోనాపై కలిసికట్టుగా పోరాడుతున్నారని, దానికి సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన కోరారు. 

నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దాన్ని విజయవంతం చేయాలనీ మరొక్కమారు గుర్తు చేస్తూ ప్రధాని నరేద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రజలందరికీ గుర్తు చేసారు. 

— Narendra Modi (@narendramodi)

ప్రపంచం ఇలాంటి విపత్కరమైన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు భారతీయులంతా సామూహిక శక్తి గొప్పతనాన్ని, ప్రజలంతా సామూహికంగా కలిసికట్టుగా కొనసాగితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పారని, ఈ కార్యక్రమాన్ని కూడా అలానే నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

మొన్న ప్రధాని మాట్లాడుతూ... ఈ కరోనా పై యుద్ధంలో అందరం చరితార్థులం అయ్యే రోజులు ముందు కనబడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇండ్లలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఒంటరి వారు కారని, వారందరితో 130 కోట్ల మంది భారతీయులు తోడు ఉన్నారని అన్నారు. 

ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా కూర్చొని తామొక్కరమే ఈ యుద్ధాన్ని ఎలా గెలుస్తామని, తామొక్కరం యుద్ధం చేస్తే సరిపోతుందా అని ఆలోచిస్తున్నారని, కానీ ఈ యుద్ధాన్ని ఒక్కరే కాకుండా దేశంలోని 130 కోట్ల మందితో కలిసి చేస్తున్నారని మోడీ తెలిపారు. 

ఈ ప్రస్తుత లాక్ డౌన్ అవసరం. అందరం ఇండ్లలోనే ఉండాలి. అలా అని ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. 130 కోట్ల సామూహిక శక్తి ఇది అని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు ప్రజలందరి దగ్గరినుండి ఆదివారం రోజున 9 నిమిషాలు కోరారు. 

కరోనా అంధకారాన్ని జయించాలంటే... ప్రకాశవంతమైన జ్వాలలు అవసరమని, ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆఫ్ చేసి బాల్కనీలల్లకు, దర్వాజల వద్దకు వచ్చి తమకు అందుబాటులోని వెలుగులను ప్రసరించాలని కోరారు. 

కొవ్వొత్తి కానీ, దీపం కానీ, ఆఖరకు మొబైల్ ఫ్లాష్ లైట్ కానీ ఏదో ఒకదాన్ని నలువైపులా ప్రసరింపజేస్తే... కరోనా అంధకారం పై మనం గెలుస్తామన్న శక్తి వస్తుందని, ఈ యుద్ధంపై భారత జాతి అంతా కూడా ఐకమత్యంతో ఉందనే సందేశం వెళుతుందని, ఇండ్లలో ఉన్నవారు ఈ పోరులో ఒంటరులు కారు అని చాటి చెప్పాలని మోడీ పిల్లుపునిచ్చారు.  

ఇలా భారతీయులంతా వెలుగులు ప్రసరిస్తే... దేశంలో ఈ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పెద్ద వర్గానికి చెందినవారంతా కూడా ఈ కరోనా పై యుద్ధంలో తవరలోనే విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. 

ఉత్సాహాన్ని మించిన శక్తి లేదని, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తే... మనల్ని ఆప్ శక్తి ఎవ్వరికి లేదని, ఈ కరోనా మహమ్మారి పై విజయం సిద్ధిస్తుందని, ఆ దిశగా మార్గం సుగమం అవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. 

ఈ కార్యక్రమంలో ఎవ్వరు కూడా ఇండ్లు ధాటి బయటకు రావొద్దని, సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖను దాటవద్దని మోడీ మరోమారు ప్రజలకు పిలుపునిచ్చారు. 

click me!