కరోనా ఎఫెక్ట్... ఉద్యోగుల గుండెల్లో గుబులు..136మిలియన్ల ఉద్యోగాలు...

By telugu news team  |  First Published Mar 31, 2020, 10:47 AM IST

ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులు ఇలానే కొనసాగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 136 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ అంచనా.


కరోనా మహమ్మారి విజృంభణ మమూలుగా లేదు. భారత్ లో ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ నుంచి దేశాన్ని రక్షించేందుకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... కేసులు తగ్గకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. కరోనా ఎఫెక్ట్ తో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.

Also Read బ్రేకింగ్... ఒకే కుటుంబంలో 25మందికి కరోనా...

Latest Videos

కోవిడ్ 19 దెబ్బకి దేశీ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. మరీముఖ్యంగా వ్యాపార సంస్థలపై దీని ఎఫెక్ట్ బాగా పడుతోంది. లాక్ డౌన్ కారణంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాలు మూతపడ్డాయి. ఆదాయం భారీగా క్షీణించింది. ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులు ఇలానే కొనసాగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 136 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ అంచనా.

ఈ లాక్ డౌన్ పై ఆగ్రాకి చెందిన ఓ ట్రావెల్ బ్యూరో ఛైర్మన్, ఎండీ మీడియాతో మాట్లాడారు. గతేడాది 10మిలియన్ల మంది తాజ్ మహల్ వీక్షించేందుకు ఆగ్రా వచ్చారని ఆయన అన్నారు. కరోనా భయంతో ఈ ఏడాది ఎవరూ అడుగుపెట్టలేదని చెప్పారు. లాక్ డౌన్ తో ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కనీసం ఒక్క టూరిస్ట్ కూడా వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. అంటే.. దాదాపు 6నెలల పాటు తనకు ఎలాంటి ఆదాయం ఉండదని.. కానీ తాను మాత్రం ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఇదే పరిస్థితులు తాను తట్టుకోలేనని.. ఈ క్రమంలో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు.

ఇదేవిధంగా అన్ని కంపెనీలు ఆలోచిస్తాయి. ఎలాంటి ఆదాయం లేకుండా ఉద్యోగులకు ఏ సంస్థ జీతాలు ఇవ్వాలని అనుకోదు. ఈ క్రమంలో తన సమస్య నుంచి బయటపడేందుకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

రిటైలర్స్ అసోసియేషన్ తాజా నివేదిక ప్రకారం.. లాక్ డౌన్ కొనసాగితే రిటైల్ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ప్రతి మూడు ఔట్‌లెట్స్‌లో ఒకటి మూతపడుతుంది. జూన్ వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటే 30 శాతం రిటైల్ స్టోర్లు కనుమరుగవుతాయి. దీంతో ఏకంగా 18 లక్షల మంది ఉపాధి కోల్పోతారు. భార‌త్‌లో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా రూ.4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. వీటి ద్వారా 60 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా వీరంతా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.

click me!