నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్ధిని మాధురి ఆత్మహత్య

Published : Mar 29, 2021, 08:01 PM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్ధిని మాధురి ఆత్మహత్య

సారాంశం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ముల్లి మాధురి(20) ఆత్మహత్య చేసుకొంది.   

విజయవాడ:నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ముల్లి మాధురి(20) ఆత్మహత్య చేసుకొంది. 

కాకినాడ  గాంధీనగర్ కు  చెందిన గోవింద్ కుమార్తె గా  సిబ్బంది గుర్తించారు. సెలవు కారణంగా విద్యార్థులు హాస్టల్ లో ఉన్నారు.  భోజన సమయం కావడంతో తోటి విద్యార్థులు భోజనానికి వెళ్లగా రూమ్ లోనే మాధురి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది.

మాధురి ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. మాధురి ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని గుర్తించిన తోటి విద్యార్ధినులు లెక్చరర్స్ కు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మాధురి ఆత్మహత్య గురించి తోటి విద్యార్థులతో పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి