అశోక్ బాబు దీక్ష కుట్రే...జగన్ వెనకే మేమంతా: ఉద్యోగ సంఘాల జెఎసి

By Arun Kumar P  |  First Published Apr 7, 2020, 11:45 AM IST

ఉద్యోగ సంఘాలతో రాజకీయ కుట్రలు చేయాలని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రయత్నిస్తున్నారని అమరావతి ఉద్యోగసంఘాల జేఏసి నాయకులు ఆరోపించారు.  


విజయవాడ‌: ప్రభుత్వంలో బాగస్వామ్యులైన ఉద్యోగులు వారి జీవితాన్ని పణంగా‌ పెట్టి కరోనా నుంచి ప్రజలను రక్షిస్తున్నారని ఎపి జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఎపిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం ఒక వాయిదా, మరో వాయిదాలో 50 శాతం  ఇస్తామని ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఇబ్బంది అయితే తప్ప జీతాలు వాయిదా వేయొద్దని కోరినట్లు తెలిపారు. 

ఉద్యోగుల కోసం టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఒక్క రోజు నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగానూ, నవ్వొచ్చేలా ఉందన్నారు. ఉద్యోగులను అడ్డుగా చూపించి పదవి సంపాదించిన చరిత్ర‌ అశోక్ బాబుదని అన్నారు. ప్రస్తుత  పరిస్థితుల్లో దీక్ష చేసేంత అవసరం లేదని... ఈ నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు.  

Latest Videos

''గతంలో ఉద్యోగుల జివితాన్ని తాకట్టు పెట్టిన నీవా మా గురించి మాట్లాడేది. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు ఇప్పుడెందుకు. ఉద్యోగ సంఘంలో మీ అరాచకాన్ని తట్టుకోలేక ఏర్పడింది మా అమరావతి జెఎసి ఉద్యోగ సంఘం. గత ప్రభుత్వ హయాంలో అరియస్ నాలుగేళ్ళ పాటు ఇప్పించలేక పోతే అమరావతి జెఎసి ద్వారానే సాధించిన విషయం మార్చిపోకు'' అని విమర్శించారు.

 ''గత ప్రభుత్వానికి సహకరించాం, ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మమ్మల్ని కదిలించొద్దు..మీ హయాంలో చేసిన అరాచకాలన్నీ బయటపెడతాం. మా‌ ఉద్యోగులకు ఏం కావాలో మాకు తెలుసు...మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగ‌సంఘాల మీద రాజకీయ ముద్ర వేసిన చరిత్ర నీది..నీ వలన ఉద్యోగస్తులమంతా ఇప్పుడు బాధ పడుతున్నాం. మీ రాజకియం మీరు చేసుకోండి..మేం మీ జొలికి రాం..మా జోలికి రావొద్దు'' అని హెచ్చరించారు.
 
''ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించారు.  మిగిలిన 50 శాతం కోసం ప్రభుత్వాన్ని కోరతాం. మా ‌జీతభత్యాలు తాకట్టు పెట్టింది గతంలో మీరు కాదా. ప్రజలకు కావాల్సిన వాటికి ప్రభుత్వం నుంచి అడగండి... ఉద్యోగస్తుల జోలికి రావొద్దు. విశ్రాంత ఉద్యోగస్తులకు 100 శాతం పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని పేర్కొన్నారు. 

''కరోనా పై రెవెన్యూ ఉద్యోగుల కష్టాన్ని సిఎం వద్దకు తీసుకెళ్ళాం. రెవెన్యూ ఉద్యోగస్తులు ఎవరూ అందోళన చెందవద్దు...కరోనా భయంతో ఇంటికి వెళ్ళకుండా కష్టపడుతున్న ఉద్యోగుల సేవలను సిఎం గుర్తించారు.  ఇంకా కొన్ని రోజులు కష్టపడండి... కరోనా‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు మరింత కష్టపడి ప్రజలను రక్షిద్దాం'' అని  పిలుపునిచ్చారు. 

''కొంతమంది కుట్రతో పారిశుద్య కార్మికులు, ఎఎన్ఎంతో ధర్నాలు చేయించి రాజకియం చేయాలని చూస్తున్నారు. పనిచేసే వాడికి ఎస్మా గురించి అవసరమేముంది. పనిచేయని వాడే ఎస్మా గురించి భయపడతారు. అశోక్ బాబుకు వాళ్ల నాన్న చనిపొతే ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ కు జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమని మేము పోరాడుతుంటే డిగ్రీ వాళ్ల కు ఇవ్వమని అడిగిన వ్యక్తి అశోక్ బాబు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. 


 

click me!