ఏపిలో పెరుగుతున్న కరోనా కేసులు... లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం

By Arun Kumar P  |  First Published Mar 30, 2020, 3:35 PM IST

కరోనా వైరస్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ లో  రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను మరింత  కఠినతరం చేశాారు.   


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఇకపై కేవలం ఐదుగంటలు మాత్రమే ప్రజలను బయటికి రానివ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం నుండే తాడేపల్లిలో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు స్థానిక సీఐ అంకమ్మరావు తెలిపారు. 

ఇకపై తాడేపల్లిలో ఉ. 6 నుండి ఉ.11వరుకే వివిధ అవసరాలపై ప్రజలను రోడ్ల మీదకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. పచారి షాపులు, పళ్ల మార్కెట్, రైతు బజార్లు మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయన్నారు. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడక్ట్ అందుబాటులో ఉంటాయన్నారు. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి వుందన్నారు. 

Latest Videos

ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటి, రెవిన్యూ, మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికిల్స్ కు మాత్రమే ఎక్కడికైనై వెళ్లడానికి అనుమతి వుందన్నారు. అలాగే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్, మొబైల్ కమ్యూనికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి వుందన్నారు. 

నిత్యావసర సరుకుల దుకాణలకు తప్పితే ఎటువంటి దుకాణాలకు తెరిచివుంచడానికి అనుమతి లేదన్నారు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండవద్దని...నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 


 

click me!