టోర్సస్ ప్రిటోరియన్ హెవీ డ్యూటీ ఆఫ్-రోడ్ స్కూల్ బస్..

By Sandra Ashok Kumar  |  First Published Oct 24, 2020, 5:29 PM IST

ఫారెస్ట్, మైనింగ్, ఎమర్జెన్సీ సర్వీస్, యాత్ర ప్రవేల్, స్కై  రిసార్ట్స్ వంటి ఇతర పారిశ్రామిక ఉపయోగాలకు టోర్సస్ ప్రిటోరియన్ వాహనం సరిగ్గా సరిపోతుంది.
 


సిజెక్ బస్సు తయారీ సంస్థ టోర్సస్ ఆఫ్-రోడ్ వాహనం ప్రిటోరియన్ స్కూల్ బస్సును ఆవిష్కరించింది. ఫారెస్ట్, మైనింగ్, ఎమర్జెన్సీ సర్వీస్, యాత్ర ప్రవేల్, స్కై  రిసార్ట్స్ వంటి ఇతర పారిశ్రామిక ఉపయోగాలకు టోర్సస్ ప్రిటోరియన్ వాహనం సరిగ్గా సరిపోతుంది.

టోర్సస్ సంస్థ ప్రిటోరియన్ ఆఫ్-రోడ్ స్కూల్ బస్సును ప్రవేశపెడుతు, ఇది ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన  స్కూల్ మార్గాల కోసం ఉద్దేశించబడింది అని కంపెనీ తెలిపింది. ఒక స్కూల్ బస్సుకు 16 అంగుళాల గ్రౌండ్ క్లియరెన్స్ తో రెండు అడుగుల లోతు ఉన్న నీటి ప్రవాహాన్ని దాటగల  సామర్థ్యం అవసరమా అని మేము ఆశ్చర్యపోతున్నారా?

Latest Videos

also read బైక్ రైడర్స్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి.. ...

 టోర్సస్ ప్రిటోరియన్  స్కూల్ బస్సు పసుపు రంగులో స్కూల్స్ అవసర్లకు ఉపయోగంగా ఉండేలా  మరికొన్ని కొత్త మార్పులు చేసి దీనిని రూపొందించి. ఇందులో బస్సు సీట్లు పాలిమర్ ప్రొటెక్టివ్ ఫినిషింగ్ తో వాటిని మరింత మన్నికైనదిగా చేసింది అలాగే టోర్సస్ బస్ సీట్ కవర్లపై కొన్ని కూల్ మ్యాథ్ / సైన్స్  సింబల్స్ జోడించింది.

ఈ బస్సు లో స్టాండర్డ్ గా   35 మంది వరకు కూర్చుఓవచ్చు, అలాగే ఈ స్కూల్ బస్ కఠినమైన భూభాగాల్లో మంచి పట్టు కోసం కొత్త మిచెలిన్ ఆఫ్-రోడ్ టైర్లతో వస్తుంది.

టోర్సస్ ప్రిటోరియన్ ట్రక్ & బస్ సాంకేతిక పరిజ్ఞానం మీద నిర్మించబడింది. ఇది 6.9-లీటర్ ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, 240 బిహెచ్‌పి,  925 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతానికి టోర్సస్ సంస్థ కొత్త హెవీ డ్యూటీ ఆఫ్-రోడ్ ప్రిటోరియన్ స్కూల్ బస్సు ధర లేదా లభ్యతపై ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.
 

click me!