రెనాల్ట్ ట్రైబర్ కార్ ధరల పెంపు.. కారణం ఏంటంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Sep 24, 2020, 12:20 PM IST

 రెనాల్ట్ ట్రైబర్ గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్ లో ప్రవేశించిది. ఆ తరువాత బిఎస్ 6 రెనాల్ట్ ట్రైబర్‌ను  4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో  ఈ ఏడాది జనవరిలో  ఇండియాలో విడుదల చేశారు. 


కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ పాపులర్ ఎంపీవీ ట్రైబర్ కారు ధరలను పెంచింది. రెనాల్ట్ ట్రైబర్ గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్ లో ప్రవేశించిది. ఆ తరువాత బిఎస్ 6 రెనాల్ట్ ట్రైబర్‌ను  4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో  ఈ ఏడాది జనవరిలో  ఇండియాలో విడుదల చేశారు.

బిఎస్ 6  అప్ డేట్ కారణంగా కంపెనీ రెనాల్ట్ ట్రైబర్‌ ధరలను ప్రత్యేకంగా 29వేల వరకు పెంచింది. రెనాల్ట్ ట్రైబర్‌  ఎంపివి లాంచ్ నుండి ఇప్పటికీ నాలుగు సార్లు ధర పెరగడం గమనార్హం. ఇప్పుడు బిఎస్ 6-కంప్లైంట్ ఎంపివి ధరల పెరుగుదల 11,500 నుండి 13,000 వరకు ఉంటుంది.

Latest Videos

also read నార్టన్ 650 సిసి ఇంజన్‌తో సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 అడ్వెంచర్ బైక్‌.. ...

అంతేకాదు కంపెనీ బేస్ వేరియంట్ ధరను కూడా పెంచింది. కొత్త ధరలు అమల్లోకి రావడంతో  రెనాల్ట్ ట్రైబర్‌ ఆర్‌ఎక్స్‌ఈ  వేరియంట్ ధరపై 13వేల పెంపుతో  కొత్త ధర రూ.5.12 లక్షలు. అలాగే 12,500 పెంపుతో ఆర్ఎక్స్ జెడ్, ఆఎక్స్ జెడ్ ఏఏంటీ  వేరియంట్‌ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) రూపాయలు.

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి సింగిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో వస్తుంది, 1.0-లీటర్, 3-సిలిండర్ యూనిట్. ఇంజన్ 5-స్పీడ్ ఏ‌ఎం‌టి యూనిట్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా అందిస్తున్నారు. పెట్రోల్ వేరియంట్ 70 బిహెచ్‌పి శక్తిని, 96 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను తయారు చేస్తుంది.
 

click me!