ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న టెస్లా.. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు

Ashok Kumar   | Asianet News
Published : Sep 22, 2020, 11:06 AM IST
ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న టెస్లా.. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు

సారాంశం

ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమోటివ్ కంపెనీ చివరకు భారతదేశంలోకి  ప్రవేశించనున్నట్లు కనిపిస్తోంది. బెంగళూరు నగరంలో ఒక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టెస్లా కంపెనీ కర్ణాటకలోని పరిశ్రమల విభాగంతో చర్చలు జరిపినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్  టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సూచించారు.  ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమోటివ్ కంపెనీ చివరకు భారతదేశంలోకి  ప్రవేశించనున్నట్లు కనిపిస్తోంది.

బెంగళూరు నగరంలో ఒక పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టెస్లా కంపెనీ కర్ణాటకలోని పరిశ్రమల విభాగంతో చర్చలు జరిపినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. "ఆర్‌అండ్‌డి కేంద్రం కోసం, మేము ఇప్పటికే రెండు రౌండ్ల చర్చలు జరిపాము" అని పరిశ్రమల విభాగం శాఖకు చెందిన ఒక అధికారి తెలిపినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

అమెరికా తరువాత టెస్లా ఏర్పాటు చేయనున్న తొలి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఇదే. బెంగళూరు నగరం కొన్ని పెద్ద టెక్ కంపెనీలకు నిలయం. ఆపిల్ సంస్థ బెంగళూరులో ఒక యాప్ యాక్సిలరేటర్‌ను కలిగి ఉంది, ఇది దాని ప్లాట్‌ఫారమ్‌ల కోసం అభివృద్ధి చేసే డెవలపర్‌లకు సేవలు అందిస్తుంది.

also read కొత్త కలర్ ఆప్షన్ లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200.. ...

గూగుల్‌తో పాటు  మైక్రోసాఫ్ట్ కూడా ఆర్ అండ్ డి సెంటర్‌ బెంగళూరు నగరంలో ఉన్నాయి. వీటితో పాటు అమెజాన్ ఇండియా కార్యకలాపాల కోసం ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండగా హువావే, ఐబిఎం, శామ్సంగ్ ఆర్ అండ్ డి సౌకర్యాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

ఎలోన్ మస్క్  లాక్ డౌన్ విధానాలపై విమర్శలు చేసినప్పటికీ భారతదేశంలో ఆర్ అండ్ డి సదుపాయాన్ని సృష్టించడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ వార్తను ఐకెఇఎ నగరంలోని ప్రధాన గ్లోబల్ సదుపాయాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో టెస్లా టయోటాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమోటివ్ తయారీదారుగా అవతరించింది.  

PREV
click me!

Recommended Stories

Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి