టాటా టియాగో కొత్త స్పెషల్ సాకర్ ఎడిషన్.. లీకైన ఫోటోలు..

By Sandra Ashok KumarFirst Published Sep 23, 2020, 3:27 PM IST
Highlights

టాటా టియాగో సాకర్ ఎడిషన్ అని పిలవబడే ఈ మోడల్ ఇటీవల డీలర్‌షిప్‌లో రెండు కలర్ ఆప్షన్స్ లో ఎక్స్టెరియర్ డెకాల్స్, గ్రాఫిక్‌లతో కనిపించింది. ఇది కారు ఫీచర్స్ లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది. 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ టియాగోలో త్వరలో  కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ వస్తున్నట్లు లీకైన ఫోటోల ద్వారా తెలుస్తుంది. టాటా టియాగో సాకర్ ఎడిషన్ అని పిలవబడే ఈ మోడల్ ఇటీవల డీలర్‌షిప్‌లో రెండు కలర్ ఆప్షన్స్ లో ఎక్స్టెరియర్ డెకాల్స్, గ్రాఫిక్‌లతో కనిపించింది.

ఇది కారు ఫీచర్స్ లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది. ఎక్స్టెరియర్ గ్రాఫిక్స్ లో  బ్లాక్-అవుట్ సి డిజైన్ వెనుక ఫెండర్‌లకు వచ్చేటప్పుడు పిక్సెల్‌ బ్రేక్, అలాగే డోర్స్  దగ్గర బ్లాక్, బూడిద రంగులో ఎల్- ఆకారపు డిజైన, ముందు భాగంలో 'సాకర్ ఎడిషన్' అక్షరాలు కొత్తగా కనిపిస్తాయి.

ఫోటోలో చూస్తే రెండు రకాల అల్లాయ్ వీల్‌ అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కారు క్యాబిన్‌లో ఎటువంటి మార్పులను చేయలేదు. ఫాబ్రిక్ సీట్ కవర్లతో డ్యూయల్-టోన్ రంగులలో వస్తాయి.

also read ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ లో ప్యుగోట్ మెట్రోపాలిస్ స్కూటర్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్.. ...

ఫీచర్స్ పరంగా రెగ్యులర్ టాటా టియాగో ప్రస్తుతం హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, గ్లోసీ గ్రిల్, క్రోమ్ ఫాగ్ లైట్స్ , 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌, బ్లాక్ ఓ‌ఆర్‌వి‌ఎం ఇంటిగ్రేటెడ్ లైట్లను అందిస్తోంది.

క్యాబిన్ లో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, రియర్ పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో- ఫోల్డ్ ఎలక్ట్రిక్ ఓ‌ఆర్‌వి‌ఎంలతో వస్తుంది.

ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ బ్రేకింగ్ తో పాటు ఇబిఎస్, ఇతర భద్రతా ఫీచర్స్  పొందుతుంది. టాటా టియాగో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, 85 బిహెచ్‌పి, 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ను అభివృద్ధి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ‌ఎం‌టి)  గేర్ అందించారు.


 

click me!