మెర్సిడెస్ బెంజ్ కొత్త సర్వీస్ ప్రోగ్రాం... కేవలం 3 గంటలో...

By Sandra Ashok Kumar  |  First Published Jan 27, 2020, 1:47 PM IST

కొత్త ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్ ప్రోగ్రామ్‌తో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కార్ల కస్టమర్లు ఇప్పుడు 3 రోజుల్లో తమ కారును పర్ఫెక్ట్  కండిషన్ చేసి అందిస్తారు. ప్రమాదవశాత్తు జరిగిన డామేజ్, రిపేర్, పెయింటింగ్ లాంటివి పూర్తిగా సరిచేసి ఇస్తారు.
 


  ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పుడు వారి కస్టమర్లకోసం ఒక కొత్త స్పెషల్ సర్వీస్ ప్రోగ్రాం  ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త   స్పెషల్ సర్వీస్ ప్రోగ్రాం "ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్" ద్వారా  కార్ ఆక్సిడెంట్, కార్ డామేజ్, కార్ పెయింటింగ్ సంబంధించి అన్నీ రిపేర్స్  కేవలం మూడు రోజుల్లో రెపైర్ చేసి కస్టమర్లకు అందించనున్నారు.  

కొత్త సర్వీస్ 'ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్' అనే ప్రోగ్రాంతో కంపేనీ మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లు మూడు రోజుల్లో వారి కార్ సంబంధించి  ఆక్సిడెంట్ రిపైర్ పనులను సరి చేసి అందిస్తారు అని పేర్కొంది.కారు రిపైర్ చేయటానికి తక్కువ సమయం, నాణ్యమైన పార్ట్లు, అత్యాధునిక రిపైర్ సిస్టం  సహాయంతో  కస్టమర్లకు రిపైర్ విషయంలో రాజీ పడకుండా చూస్తుంది. 

Latest Videos

undefined

also read హోండా మోటర్స్ సరికొత్త రికార్డు... 4 నెలల్లో లక్ష యూనిట్ల సేల్స్

కొత్త 'ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్' కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కస్టమర్ సర్వీసెస్ అండ్ కార్పొరేట్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు శేఖర్ భిడే మాట్లాడుతూ, "భారతదేశంలో మన వృద్ధి వ్యూహంలో కస్టమర్ సర్వీస్ అనేది కీలకమైన అంశం.


'ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్' ప్రారంభించడం అనేది ఈ దిశలో ఒక అడుగు. దశాబ్దాలుగా మా కస్టమర్ల నుండి మేము పొందిన నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇది మరింత సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. "  వైస్ ప్రెసిడెంట్ శేఖర్ భిడే,

also read మారుతి సుజుకి నుండి కొత్త బి‌ఎస్-6 కారు లాంచ్...

ఫాస్ట్ లేన్ బాడీ & పెయింట్ రిపేర్ అనేది సంస్థ యొక్క 'రెస్ట్‌లెస్ ఫర్ టుమారో' లో భాగమైన ఒక రకమైన సర్వీస్ కార్యక్రమం. ఇందులో భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్‌ను విస్తరించడానికి వినూత్న పరిష్కారాలు మరియు సేవలను అందించడం జరుగుతుంది.

ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్ సర్వీస్ ప్రోగ్రామ్ వంటి గతంలో ప్రవేశపెట్టిన సర్వీస్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే కంపెనీ  మెర్సిడెస్ బెంజ్ కారును మూడు గంటల్లో పూర్తిగా సర్వీస్ చేస్తామని హామీ ఇచ్చింది.
 

click me!