ఎంజీ మోటార్స్ తన తొలి విద్యుత్ ఎస్‌యూవీ వాహనాన్ని భారత విపణిలో గురువారం ఆవిష్కరించింది. దీని ధర 20.88 నుంచి రూ.23.58 లక్షలు పలుకుతుంది. రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ కారు బుకింగ్స్ ఈ నెల 17వ తేదీనే ముగించారు. నాటిలోగా బుక్ చేసుకున్న వారికి రూ.లక్ష తక్కువకే కారు సరఫరా చేయనున్నది ఎంజీ మోటార్స్. కేవలం ఎనిమిది క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారు సొంతం.
న్యూఢిల్లీ: హెక్టర్ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను గణనీయంగా ఆకట్టుకుటున్న ఎంజీ మోటార్స్ జడ్‌ఎస్ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్ కారును విపణిలోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్ ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
also read టయోటా, హోండా కార్లలో సమస్యలు... 60 లక్షల యూనిట్ల రీకాల్
ఎక్సైట్ వేరియంట్ కారు ధర రూ.20.88లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 17వ తేదీతో ఈ కార్ల బుకింగ్స్ నిలిపివేశారు. అప్పటిలోపు బుక్ చేసుకున్న వారికి రూ.లక్ష తగ్గింపు ధరతో విక్రయిస్తారు.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే ఈ కారును విడుదల చేశారు. ఈ కారులో 44.5 కిలోవాట్స్ శక్తి ఉన్న బ్యాటరీని అమర్చారు. దీన్ని ఒకసారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది.
also read కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!
40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం ఎనిమిది క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారు సొంతం. ఆఫీస్, ఇంట్లో ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ను ఎంజీ అందజేస్తోంది.