మారుతి సుజుకి నుండి కొత్త బి‌ఎస్-6 కారు లాంచ్...

By Sandra Ashok KumarFirst Published Jan 25, 2020, 1:04 PM IST
Highlights

మారుతి సుజుకి సియాజ్ బి‌ఎస్-6 కారు ఎస్ సిగ్నేచర్ డ్యూయల్-టోన్ స్పోర్టి ఎక్స్‌టిరియర్స్, సైడ్ & రియర్ అండర్ బాడీ స్పాయిలర్స్, ట్రంక్ లిడ్ స్పాయిలర్, ఓ‌ఆర్‌వి‌ఎం కవర్,  ఫ్రంట్ ఫాగ్ లాంప్ తో వస్తుంది.

 ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కంపెనీ కొత్త సియాజ్ బి‌ఎస్ 6 కారును విడుదల చేసింది. మారుతి సుజుకి కంపెనీ  బిఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సియాజ్‌ కారు విడుదల చేస్తూ దానిలో ఉండే కొత్త మార్పులను తెలిపింది. ఈ కారు పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.

also read మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ కారు...వారికి రూ.1 లక్ష తగ్గింపు...

మారుతి సుజుకి సంస్థ సియాజ్ కారు బిఎస్ 6 బ్రిగేడ్‌లో చేరిన 11వ కారు.మారుతి సుజుకి సియాజ్ బిఎస్ 6 వేరియంట్  కారు ధర  8.31 లక్షల నుండి  ప్రారంభమయి 11.09 లక్షల వరకు ఉంటుంది.మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ స్పోర్ట్స్ వేరియంట్ అయిన సియాజ్ ఎస్ ను కూడా విడుదల చేసింది.

సియాజ్ ఎస్ సాంగ్రియా రెడ్, ప్రీమియం సిల్వర్, పెర్ల్ స్నో వైట్ అనే మూడు రంగులలో లభిస్తుంది. సియాజ్ ఎస్ సిగ్నేచర్ డ్యూయల్-టోన్ స్పోర్టి ఎక్స్‌టిరియర్స్, సైడ్ & రియర్ అండర్ బాడీ స్పాయిలర్స్, ట్రంక్ లిడ్ స్పాయిలర్, ఓ‌ఆర్‌వి‌ఎం కవర్,  ఫ్రంట్ ఫాగ్ లాంప్ తో వస్తుంది.


డ్యూయల్ టోన్ థీమ్ డార్క్ ఫినిష్ తో మల్టీస్పోక్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ద్వారా వస్తుంది.దీని లోపలి, బయట భాగంలో స్పోర్టి సిగ్నేచర్ రూపాన్ని కలిగి ఉంటుంది. డోర్ ట్రిమ్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌పై సిల్వర్ అసెంట్స్ డిజైన్, కొత్త లేటెస్ట్ బ్లాక్ ఇంటీరియర్‌లు ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్  స్పోర్ట్స్ కొటెంట్ మెరుగుపరుస్తాయి.

also read మార్కెట్లోకి టాటా మోటార్స్ కొత్త కారు...ధర ఎంతంటే ?


మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ "సియాజ్ 2014 లో ప్రారంభించినప్పటి నుండి అత్యంత పాపులరిటీ పొందిన మిడ్-సైజ్ సెడాన్ కారు ఇంకా ఇది అమకాలలో మంచి వృద్ధిని సాధించింది.


2.7 లక్షలకు పైగా ఉన్న హ్యాపీ కస్టమర్లతో ఇది దాని విభాగంలో 29% మార్కెట్ వాటాను కలిగి ఉంది. సియాజ్ దాని ప్రభావవంతమైన ఎక్స్తిటియర్, అధునాతన ఇంటీరియర్స్ మరియు స్ట్రాంగ్ పర్ఫర్మెంస్ పాపులారిటీని పొందింది." అని అన్నారు.
 

click me!