మారుతి సుజుకీ కారుకి ‘ఇండియన్లు’ ఫిదా... అందరికీ నచ్చేలా డిజైన్..

By Sandra Ashok KumarFirst Published Jan 14, 2020, 12:09 PM IST
Highlights

2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఆ తర్వాతి క్రమంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. నాటి నుంచి ఈనాటి వరకు దేశీయ కార్ల విక్రయాల్లో విటారా బ్రెజ్జా కారు అగ్రస్థానంలోనే నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీకి చెందిన కాంప్యాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా మరో రికార్డును సృష్టించింది. ఈ మోడల్ కారు దేశీయ మార్కెట్లోకి విడుదలైన నాలుగేండ్లలో ఐదు లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. 2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఆ తర్వాతి క్రమంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. నాటి నుంచి ఈనాటి వరకు దేశీయ కార్ల విక్రయాల్లో విటారా బ్రెజ్జా కారు అగ్రస్థానంలోనే నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

also read కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్

సుజుకీ కోర్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ కారును దేశీయ వినియోగ దారులకు నచ్చేలా డిజైన్ చేసినట్లు మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఈడీ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. కేవలం 47 నెలల్లోనే ఐదు లక్షల విటారా బ్రెజ్జా యూనిట్లు అమ్ముడవడం విశేషమని శశాంక్ శ్రీ వాత్సవ పేర్కొన్నారు.

ఇకముందు కూడా భారతీయుల హ్రుదయాలను విటారా బ్రెజ్జా గెలుచుకుంటుందని, అందులో సందేహం లేనే లేదన్నారు. వచ్చేనెలలో జరిగే ఆటో ఎక్స్ పోలో విటారా బ్రెజ్జా మోడల్ కారును మారుతి ఆవిష్కరించనున్నది. నూతన డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ కారు బెస్ట్ సెల్లర్‌గా రూపాంతరం చెందింది. 


క్రోమ్ గ్రిల్లే, ఎ ఫ్లోటింగ్ రూఫ్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, టిల్ట్ స్టీరింగ్, కూల్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, మూడ్ లైటింగ్, 7- అంగుళాల స్మార్ట్ ఫ్లే ఇన్ఫోటైన్మెంట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటిబుల్, డ్యుయల్ ఎయిర్ బాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, పార్కింగ్ సెన్సర్లు, ఐఎస్వోఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, హై స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ తదితర సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. 

also read ‘స్ప్లెండర్’, ‘ఫ్యాషన్’ బైక్‌లు....చరిత్రనే తిరగ రాశాయి.....

ఇంకా అదనంగా రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ కూడా అమర్చారు. ప్రస్తుత జనరేషన్ విటారా బ్రెజ్జా కారు 89 బీహెచ్పీ ఇంధనం, 200 ఎన్ఎం టార్చి సామర్థ్యం గల 1.3 లీటర్ల 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ దీని సొంతం. ఈ ఇంజిన్ 5- స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సౌకర్యం కలిగి ఉంటుంది. 

విటారా బ్రెజ్జా మోడల్ కారు ఆరు కలర్లు ఫెర్రీ ఎల్లో లేదా పెర్ల్ ఆర్కిటిక్ వైట్, బ్లేజింగ్ రెడ్ లేదా మిడ్ నైట్ బ్లాక్, ఆటం ఆరెంజ్ లేదా పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రీమియం సిల్వర్, గ్రానైట్ గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.7.63 లక్షల నుంచి రూ.10.60 లక్షల మధ్య పలుకుతోంది. మున్ముందు విటారా బ్రెజ్జా మోడల్ కార్లు మరిన్ని రికార్డులు నెలకొల్పుతుందని అంచనాలు ఉన్నాయి. 

click me!