ల్యాండ్ రోవర్ నుంచి రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త వెర్షన్.... అదిరిపోయే టెక్నాలజి ఫీచర్స్....

By Sandra Ashok Kumar  |  First Published Jan 11, 2020, 4:38 PM IST

ల్యాండ్ రోవర్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్‌ను 2020 మోడల్ జనవరి 30న భారతదేశంలో విడుదల చేయనుంది.2020 రేంజ్ రోవర్ ఎవోక్  బిఎస్ 6 కంప్లైంట్ 2.0-లీటర్ ఇంజెనీయం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను 2019 డిసెంబర్‌లో లాంచ్ చేసిన జాగ్వార్ ఎక్స్‌ఇకి  పవర్ ఇస్తుంది.
 


ఆటొమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా 2020 రేంజ్ రోవర్ ఎవోక్‌ను 30 జనవరి  2020న విడుదల చేయనుంది. మొదటిసరిగా దీనిని నవంబర్ 2018లో ఆవిష్కరించారు, సెకండ్ జనరేషన్ రేంజ్ రోవర్ ఎవోక్ రేంజ్ రోవర్ వెలార్ కారు ఆధారంగా  కొత్త డిజైన్, స్టైలింగ్‌తో రానుంది.

also read వరుసగా ఐదోసారి మళ్లీ లగ్జరీ కార్ల కింగ్​గా మెర్సిడెజ్​ బెంజ్​

Latest Videos

undefined

ల్యాండ్ రోవర్  కొత్త మిక్సెడ్ -మెటల్ ప్రీమియం ట్రాన్స్వర్స్ ఆర్కిటెక్చర్కు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఎవోక్ కారు లోపలి భాగం మరింత విశాలంగా ఉంటుంది.ఇంకా కార్గో స్థలం కూడా 6 శాతం పెరిగింది ఇంకా ఇందులో 610 లీటర్ల ఫ్రీ స్పేస్ కూడా అందుబాటులో ఉంది. వెనుక సీట్లు ఫోల్డ్ చేస్తే 1430 లీటర్ల వరకు స్పేస్ పెరుగుతుంది.

2020 రేంజ్ రోవర్ ఎవోక్  బిఎస్ 6 కంప్లైంట్ 2.0-లీటర్ ఇంజెనీయం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను 2019 డిసెంబర్‌లో లాంచ్ చేసిన జాగ్వార్ ఎక్స్‌ఇకి  పవర్ ఇస్తుంది.జాగ్వార్ XE లో, 2.0-లీటర్ ఇంజెనీయం పెట్రోల్ ఇంజన్ 247 బిహెచ్‌పి, 365 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, డీజిల్ యూనిట్ 178 బిహెచ్‌పి, 430 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది.

రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 1.5-లీటర్ ఇంజెనియం ఇంజన్‌తో  49-వోల్ట్ బ్యాటరీతో లైట్-హైబ్రిడ్ వెర్షన్ కూడా ఉంది. ఇది 197 బిహెచ్‌పిని, 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది.లుక్కింగ్ విషయానికొస్తే   రేంజ్ రోవర్ ఎవోక్ 2020 మోడల్ పాత మోడల్ కంటే చాలా స్టైలిష్, న్యూ డిజైన్  లుక్ తో కనిపిస్తుంది. కొత్త స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌ ల్యాంప్‌లు,టైల్ ల్యాంప్‌లు కార్  కొత్త డిజైన్ లుక్ ని పెంచుతుంది.

also read మళ్ళీ పడిపోయిన వాహన అమ్మకాలు...కారణం బి‌ఎస్ 6...?


వెలార్ కార్ లాగానే, ఎవోక్ కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో స్మూత్ గా ఉంటుంది. ఇది మీకు వెలార్ కారును మళ్ళీ గుర్తు చేస్తుంది. ఐవోక్ ఆప్షనల్ ట్విన్ టచ్‌స్క్రీన్, ఇన్‌ కంట్రోల్ టచ్ ప్రో డుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ ఫాస్ట్ సాఫ్ట్‌వేర్, 16-వే సీట్ కంట్రోల్స్, క్యాబిన్ ఎయిర్ అయానైజేషన్ వంటి కొత్త టెక్నాలజీలతో వస్తుంది. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ 'క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ' టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి వాహనం.  

click me!