Navodaya vidyalaya: న‌వోద‌య స్కూళ్ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది.. ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే

Published : Jun 02, 2025, 04:49 PM ISTUpdated : Jun 02, 2025, 04:52 PM IST
Three students passed away before NEET exam

సారాంశం

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో సీటు సంపాదించాల‌ని విద్యార్థుల‌తో పాటు పేరెంట్స్ ఆశిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న న‌వోద‌య విద్యాల‌యాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు.

6వ త‌ర‌గ‌తికి నోటిఫికేష‌న్

జవహర్ నవోదయ: 2026-27 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. జూన్ 15, 2025 నుండి జూలై 29 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న 654 నవోదయ విద్యాలయాల్లో సీట్ల భర్తీని చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ పాఠశాలలు ఉన్నాయి.

అర్హతలు, పరీక్ష తేదీలు

ఈ ఏడాది ఐదో తరగతికి వ‌చ్చే విద్యార్థులు అర్హులు. విద్యార్థుల పుట్టిన తేదీ మే 1, 2014 నుండి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలి. ప‌రీక్ష‌ను రెండు ద‌శ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. 2025 డిసెంబర్ 13 (ఉదయం 11:30 గంటలకు) – తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో, ఇక రెండో ద‌శ విష‌యానికొస్తే.. 2026 ఏప్రిల్ 11 – జమ్మూ కశ్మీర్, పర్వత ప్రాంతాల్లో నిర్వ‌హిస్తారు. ఫ‌లితాల‌ను 2027 జూన్‌లో విడుద‌ల చేస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్‌సైటు navodaya.gov.inలోకి వెళ్లాలి. అనంత‌రం హోమ్ పేజీలో క‌నిపించే "JNVST Class 6 Registration 2026-27" లింక్‌పై క్లిక్ చేయాలి. కావాల్సిన వివ‌రాల‌ను అన్నింటినీ ఎంట‌ర్ చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.

ప‌రీక్ష విధానం

ఈ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌లో మొత్తం 80 ప్ర‌శ్న‌లు ఉంటాయి. మెంటల్ అబిలిటీ: 40 ప్రశ్నలు, అర్థమెటిక్: 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్: 20 ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండ‌వు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇంజనీరింగ్ అవసరం లేదు.. టెన్త్, ఇంటర్ చదివినా లక్షల జీతంతో సాప్ట్ వేర్ జాబ్స్..!
Railway Jobs: పది పాసైతే చాలు మంచి జీతంలో ప్రభుత్వ ఉద్యోగాలు