మనదేశంలోనే అతి పెద్ద బంగారు హోల్‌సేల్ మార్కెట్ ఇదే, ఇక్కడ్నించే ఇతర చోట్లకి గోల్డ్ సరఫరా

Published : Aug 23, 2025, 12:32 PM IST
Gold Jewellery

సారాంశం

మనదేశంలో బంగారానికి ఉన్న విలువ ఇంతా అంతా కాదు. డబ్బులు దాచుకొని ప్రతి సంవత్సరం బంగారం కొనే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే మన దేశంలోనే అతిపెద్ద బంగారు హోల్ సేల్ మార్కెట్ ఎక్కడుందో తెలుసా? ముంబైలో. 

ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరిగిపోతుంది. ఇక బంగారాన్ని లక్ష్మీదేవిలా పూజించే మన దేశంలో బంగారాన్ని విపరీతంగా కొంటారు. ప్రతి ఏడాదీ కోట్ల కొద్ది బంగారం అమ్ముడుపోతూ ఉంటుంది. అందుకే మన దేశం బంగారం దిగుమతిని కూడా అధికంగానే చేసుకుంటుంది. ఇక దేశంలోకి పెద్ద మొత్తంలో దిగుమతైన బంగారం మొదట ఎక్కడ చేరుకుంటుందో తెలుసా? భారతదేశంలోనే అతి పెద్ద బంగారు హోల్‌సేల్ మార్కెట్ కు. ఈ బంగారు మార్కెట్ ముంబైలోని జవేరి బజార్. అతిపెద్ద బులియన్ మార్కెట్ గా దీన్ని పిలుచుకుంటారు. ఇక్కడికి వచ్చిన బంగారం దేశంలోని మరిన్ని చోట్లకు సరఫరా అవుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న జవేరి బజార్ ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని అతిపెద్ద బంగారు మార్కెట్ గా పిలుచుకుంటారు. దీని చరిత్ర కూడా ఈనాటిది కాదు. ఏకంగా 160 సంవత్సరాల నుంచి ఇది తన ఉనికిని చాటుతోంది. 1864లో దీన్ని బులియన్ వ్యాపారి అయినా త్రిభువన్ దాస్ జవేరి స్థాపించారు. అందుకే జవేరి బజార్ అనేది పేరు తెచ్చుకుంది.

జవేరి బజార్‌కి చేరుకున్న బంగారం దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆభరణాల రూపంలో సరఫరా అవుతుంది. ఈ మార్కెట్లోని ఆభరణాలకు ఎంతో నాణ్యత ఉంటుంది. వైవిధ్యత కూడా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం బంగారం మాత్రమే కాదు, వజ్రాలు కూడా వర్తకంలో ఉంటాయి. జవేరి బజార్లో బంగారం విషయంలో హోల్ సేల్ మార్కెట్ గానే చెప్పుకోవాలి. ఇక్కడ ఒకే ఒకేసారి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొంటే తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది. కానీ రిటైల్ కొనుగోలు ధరలు మాత్రం మార్కెట్ ధరలపైనే ఆధారపడి ఉంటాయి.

భారతదేశ బంగారు రాజధాని ఏది?

భారతదేశంలో అతిపెద్ద బంగారు మార్కెట్ గా జవేరీ బజార్ నే చెప్పుకుంటారు. కానీ భారతదేశ బంగారు రాజధానిగా మాత్రం కేరళలోని త్రిస్సూర్ ను చెప్పుకుంటారు. కేరళలో ఉన్న ఈ నగరం బంగారు వ్యాపారానికే కాదు బంగారు ఆభరణాల తయారీకి కూడా ముఖ్యమైన కేంద్రంగా మారిపోయింది. ఈ నగరంలోని ఎన్నో కర్మాకారాలు, చేతి వృత్తుల వారు పెద్ద సంఖ్యలో బంగారం ఆభరణాలను తయారు చేస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో బంగారానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా త్రిసూర్ పేరు తెచ్చుకుంది. ఇక వీటితో పాటు మహారాష్ట్రలోని జల్గావ్ నగరం, మధ్యప్రదేశ్లోని రత్లాం.. అలాగే ఢిల్లీలోని ఢిల్లీ బులియన్ మార్కెట్ కూడా పెద్ద బంగారు మార్కెట్లుగా పేరు తెచ్చుకున్నాయి. కానీ ఏవి కూడా జవేరి బజార్ ను మించలేకపోయాయి.

ఒక్కసారైనా చూడండి

జవేరి బజార్‌కు వెళితే కిరాణా షాపుల్లాగా ఆ మార్కెట్ అంతా చిన్న చిన్న బంగారు దుకాణాలతో నిండిపోయి ఉంటాయి. అక్కడ దొరికే బంగారు ఆభరణాలు కూడా భిన్నంగా ఎంతో అందంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు ముంబై వెళ్తే జవేరి బజార్లో కచ్చితంగా సందర్శించండి. కనులు చెదిరే బంగారు ఆభరణాలతో ఆ ప్రాంతం అంతా మిరుమెట్లు గొలుపుతూ ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది