త్వరలో! అమెజాన్‌లో ఫ్లైట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు

Published : Apr 10, 2019, 04:57 PM IST
త్వరలో! అమెజాన్‌లో ఫ్లైట్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు

సారాంశం

ఈ కామర్స్ దిగ్గజంగా వెలుగొందుతున్న అమెజాన్ ఇండియా తన సేవలను మరింత విస్తరిస్తోంది. త్వరలోనే ఈ అమెజాన్ ద్వారా విమాన యాన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది.  

ఈ కామర్స్ దిగ్గజంగా వెలుగొందుతున్న అమెజాన్ ఇండియా తన సేవలను మరింత విస్తరిస్తోంది. త్వరలోనే ఈ అమెజాన్ ద్వారా విమాన యాన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది.

ట్రావెల్ సైట్ క్లియర్‌ట్రిప్ జతకట్టిన అమెజాన్.. ప్రస్తుతం విమాన టికెట్ బుకింగ్ సర్వీసు మన ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉన్న ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ కామర్స్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ విమానయాన సేవలతోపాటు హోటల్స్ బుకింగ్స్, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, తదితర సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.

తన కార్యకలాపాలను విస్తరించేందుకు టోప్జో(బహుళ సేవల యాప్)ను అమెజాన్ వినియోగించుకోనుంది. అమెజాన్ ఇండియాలో స్టార్టప్ కంపెనీ టోప్జో తన సేవలను అందిస్తోంది. 

టోప్జోను గత సంవత్సరమే అమెజాన్ హస్తగతం చేసుకుంది. ఇది ఇలావుంటే, తాజాగా ప్రచారం జరుగుతున్న ఫ్లైట్ బుకింగ్ సర్వీసు వార్తలపై అటు అమెజాన్ ఇండియా గానీ, ఇటు క్లియర్‌ట్రిప్ సంస్థ గానీ ఎలాంటి అధికారిక  ప్రకటనా చేయలేదు.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్