
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు అక్కౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఆన్‌లైన్ మార్గం ఇంకా యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా SBI అక్కౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు. అలాగే మీరు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మిస్డ్ కాల్, sms ఇంకా atm ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంకుకి వెళ్ళి క్యూలైన్ లో నిల్చోవటం వారించవచ్చు. మీ SBI అక్కౌంట్ బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో మీకు ఇంకా తెలియకపోతే మిస్డ్ కాల్ అండ్ SMS ద్వారా బ్యాలెన్స్ చూడటానికి సులభమైన మార్గాలను తెలుసుకోండి..
మిస్డ్ కాల్ ద్వారా SBI అక్కౌంట్ బ్యాలెన్స్
మీరు మిస్డ్ కాల్ ద్వారా మీ SBI ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మీ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు మిస్డ్ కాల్ సౌకర్యంతో మీ ఖాతా బ్యాలెన్స్ అలాగే మినీ స్టేట్‌మెంట్‌ను కూడా చెక్ చేయవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి నంబర్ 09223766666కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. కొద్దిసేపటిలో మీకు బ్యాంక్ నుండి మెసేజ్ వస్తుంది.
ఈ మెసేజ్ లో మీరు మీ ఖాతా బ్యాలెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందుతారు. ఇంకా మినీ స్టేట్‌మెంట్‌ను చూడటానికి, మీరు 09223866666కు డయల్ చేయాలి. SBIలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుందని గమనించండి. మీరు మీ ఖాతాతో మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోనట్లయితే, మీరు మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
SMS ద్వారా SBI ఖాతా బ్యాలెన్స్
బ్యాంక్ అందించే SMS బ్యాంకింగ్ సేవను పొందడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి SMS పంపడం ద్వారా SBI ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. SBI బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 09223766666కి 'BAL' అని SMS పంపండి. దీని తర్వాత మీరు SMS ద్వారా ఖాతా బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు. ఇందులో మీరు 09223866666కు 'MSTMT' అని SMS పంపడం ద్వారా తాజా లావాదేవీని అంటే మినీ స్టేట్‌మెంట్ సమాచారాన్ని పొందవచ్చు.