Women's Day 2023: పొదుపు చేయడంలోనూ, పెట్టుబడి పెట్టడంలో పురుషుల కన్నా స్త్రీలే బెటర్ ఎలాగో తెలుసుకోండి..

Published : Mar 07, 2023, 03:34 PM IST
Women's Day 2023: పొదుపు చేయడంలోనూ, పెట్టుబడి పెట్టడంలో పురుషుల కన్నా స్త్రీలే బెటర్ ఎలాగో తెలుసుకోండి..

సారాంశం

పొదుపు విషయంలో మహిళలు పురుషుల కన్నా కూడా చాలా బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, రిస్కుకు దూరంగా ఉండటం వంటి లక్షణాల వల్ల పురుషుల కంటే కూడా స్త్రీలే ఎక్కువగా వ్యాపారంలో రాణించే అవకాశం ఉంది. 

సంపద సృష్టించాలంటే పొదుపు అలవాటు ఉండాలి. పొదుపు చేయడమే కాదు, ఆదా చేసిన డబ్బు సంపదను సృష్టించడానికి క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలి. ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫ్ఫెట్ ప్రకారం - 'ఖర్చు చేసిన తర్వాత మిగిలి ఉన్న దానిని సేవ్ చేయవద్దు, బదులుగా పొదుపు తర్వాత మిగిలి ఉన్న దానిని ఖర్చు చేయండి.’ కాబట్టి, పెట్టుబడి పెట్టడానికి, మొదట పొదుపు చేయాలి. చాలా మంది స్త్రీలు పొదుపు చేయడంలో సహజమైన లక్షణాన్ని కలిగి ఉంటారు, అయితే చాలా మంది పురుషులు సాధారణంగా ఖర్చు చేసే కేటగిరీలో ఉంటారు. కాబట్టి, మంచి పొదుపు అలవాటు పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.  ఆదా చేసిన డబ్బును సంపదను సృష్టించేందుకు మంచి మార్గంలో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలి. మహిళలు వారి క్రమశిక్షణతో కూడిన విధానం వల్ల పురుషుల కన్నా ఎక్కువ డబ్బు సేవ్ చేయగలరు.  ట్రేడ్‌స్మార్ట్ సీఈఓ వికాస్ సింఘానియా అంచనా ప్రకారం పురుషుల కంటే మహిళలను మంచి పెట్టుబడిదారులు అని కీర్తించారు. దీనికి సంబంధించిన ఐదు లక్షణాలను పేర్కొన్నారు. 

పొదుపు చేయడంలో మహిళలే నెంబర్ వన్
పెట్టుబడి విషయానికి వస్తే, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పురుషులకు ఇతర వ్యాపకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సిగరెట్లు, మద్యం, జూదం ఇలాంటి అలవాట్లు పురుషుల్లోనే ఎక్కువగా ఉంటాయి. కావునా డబ్బు దూబరా అయ్యే ప్రమాదం ఎక్కువ, అదే మహిళల విషయానికి వస్తే పురుషుల కంటే మహిళలు పొదుపు చేయడంలో మెరుగ్గా ఉంటారు. మహిళలు తమ పిల్లల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే డబ్బును దాచేందుకు ఆసక్తి చూపుతారు. 

రిస్క్ తీసుకోరు..
స్త్రీలు స్వతహాగా రిస్క్ కు దూరంగా ఉంటారు. అందుకే రిస్కులేని బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. బంగారం చారిత్రాత్మకంగా మహిళలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం. కష్టకాలంలో బంగారం ఆదుకుంటుందని మహిళలకు భరోసా.

క్రమశిక్షణ
పురుషుల కంటే స్త్రీలు క్రమశిక్షణతో ఉంటారు. మహిళలు తమ నియమాలకు కట్టుబడి ఉంటారు. ట్రేడింగ్ వంటి వ్యాపారాలకు క్రమశిక్షణ అవసరం. కావునా మహిళలు మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాల్లో డబ్బు పెట్టేందుకు సరిపోతారు. 

మల్టీ టాస్కింగ్‌లో మహిళలు నిపుణులు
స్త్రీలు మల్టీ టాస్కింగ్‌లో నిష్ణాతులు. ఇంటిని నిర్వహించడం, ఏకకాలంలో పూర్తి సమయం ఉద్యోగం చేయడం నుండి, మహిళలు అనేక పనులను నిర్వహించడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

మానసిక బలం
పురుషుల కంటే స్త్రీలకు బలమైన మానసిక శక్తి ఉంటుంది. విపత్తు సమయంలో వారు తెలివిగా ఆలోచిస్తారు. సమస్యను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. నిరాశకు చోటివ్వరు. విజయవంతమైన వ్యాపారి లేదా పెట్టుబడిదారుగా ఉండేందుకు అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్