అప్పుడు కూడా వర్క్ ఫ్రోం హోం కల్చర్ కొనసాగించోచ్చు.. : బిల్ గేట్స్

By Sandra Ashok KumarFirst Published Sep 24, 2020, 1:43 PM IST
Highlights

కోవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రపంచంలోని వివిధ దేశాలు, ప్రాంతాలు కఠినమైన లాక్ డౌన్ విధించాయి. దీంతో కొన్ని సంస్థలు వర్క్ ఫ్రోం హోం  ప్రకటించాయి. "వర్క్ ఫ్రోం హోం(డబ్ల్యుఎఫ్ఓ) సంస్కృతి చాలా ఆశ్చర్యంగా ఉంది. 

ముంబై: ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం కల్చర్ చాలా బాగా సక్సెస్ అవుతుందని కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తోలగిన తర్వాత కూడా చాలా కంపెనీలు ఈ వర్క్ ఫ్రోం హోం వ్యవస్థతో కొనసాగుతాయని బిలియనీర్ బిల్ గేట్స్ బుధవారం చెప్పారు.

కోవిడ్-19 వ్యాప్తి తరువాత ప్రపంచంలోని వివిధ దేశాలు, ప్రాంతాలు కఠినమైన లాక్ డౌన్ విధించాయి. దీంతో కొన్ని సంస్థలు వర్క్ ఫ్రోం హోం  ప్రకటించాయి. "వర్క్ ఫ్రోం హోం(డబ్ల్యుఎఫ్ఓ) సంస్కృతి చాలా ఆశ్చర్యంగా ఉంది.

కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిన తర్వాత కూడా వర్క్ ఫ్రోం హోం కల్చర్ కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను" అని బిల్  గేట్స్ ఒక దినపత్రిక నిర్వహించిన ఆన్‌లైన్ వ్యాపార సదస్సులో అన్నారు.

also read పడిపోయాయి బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములకు 50వేల కంటే తక్కువ.. ...

చాలా కంపెనీలు తమ ఉద్యోగులు సమయాన్ని 50 శాతం కంటే తక్కువగా కార్యాలయాలలో గడపాడానికి ఆశిస్తారని, మిగతా కంపెనీలు సాధారణ మార్గంలోకి ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆయన అన్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఆశ్చర్యకరంగా బాగా పనిచేసింది కాని పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఇళ్ళు చిన్నగా, పనులను ఉన్నప్పుడు పని చేయడం కష్టం. మహిళలు పనులు నిర్వహించడానికి చాలా ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రోం హోం లోని లోపాలను బిల్ గేట్స్ ఎత్తి చూపాడు.

భారతదేశంలో రెండు నెలల కఠినమైన లాక్ డౌన్ పని చేసిందా అనే దానిపై అవసరమైన డబ్బును బదిలీ చేయడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించడం వంటి కొన్ని "అద్భుతమైన పనులు" దేశం చేసిందని ఆయన అన్నారు.

"ప్రస్తుతం కొన్ని గొప్ప విషయాలు జరుగుతున్నాయి ప్రిమల్స్, టాటాస్ మొదలైనవి నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి" అని బిల్ గేట్స్ తెలిపారు.

click me!