Womens Day 2023: అదానీ సామ్రాజ్యం సక్సెస్ వెనుక నిలబడ్డ మహిళ ఎవరో తెలుసా..గౌతం అదానీ మాటల్లోనే తెలుసుకోండి..

Published : Mar 07, 2023, 05:20 PM IST
Womens Day 2023:  అదానీ సామ్రాజ్యం సక్సెస్ వెనుక నిలబడ్డ మహిళ ఎవరో తెలుసా..గౌతం అదానీ మాటల్లోనే తెలుసుకోండి..

సారాంశం

అదానీ ఫౌండేషన్‌ను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కానీ నేడు భారతదేశం అంతటా ఏటా 32 లక్షల మందికి సహాయం అందిస్తోంది. దీని విస్తరణలో ప్రీతీ అదానీ పెద్ద హస్తం ఉంది.

కొద్ది రోజుల క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు చాలా తక్కువగానే తెలుసు. అంబానీ కుటుంబం గురించ తెలిసినట్లు అదానీ కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదు. అయితే ప్రస్తుతం అదానీ వార్తలు ప్రతిరోజు హెడ్ లైన్స్ లో ఉంటున్నాయి, దీంతో ఆయన కుటుంబ వివరాలు కూడా తెలుుకునేందుకు ప్రజలు ఎక్కువా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అవతరించిన అదానీ వెనకుండి నడిపించిన ఆయన భార్య గురించి తెలుసుకుందాం. గౌతం అదానీ తన భార్య ప్రీతీ అదానీ తన జీవితానికి మూలస్తంభం అని చెబుతుంటారు. ప్రీతి అదానీ తన పురోగతి కోసం  కెరీర్‌ను సైతం పణంగా పెట్టిందని అదానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

గౌతమ్ అదానీ తన వివాహం గురించి చెబుతూ తాన చాలా పిరికివాడని చెప్పారు. అంతేకాదు తన భార్య డాక్టర్ అని తాను ఆమెతో పోల్చితే నిరక్షరాస్యుడిని అని చెప్పుకొచ్చారు. మీడియా కథనం ప్రకారం, ఇద్దరి వివాహం వారి కుటుంబ పెద్దలు నిశ్చయించారని పేర్కొన్నారు. ప్రీతి అదానీ నేపథ్యం విషయానికి వస్తే, ఆమె ముంబైలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత ఆమె చదువు తర్వాత అహ్మదాబాద్ వచ్చింది. ఆమె  కొంతకాలం తన కుటుంబంతో కలిసి అమెరికాలో సైతం ఉంటున్నారు.

ప్రీతి అదానీ అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో డెంటల్ మెడిసిన్ చదివారు. అయితే పెళ్లి తర్వాత కెరీర్ వదులుకోవాల్సి వచ్చింది. 1996లో వివాహం తర్వాత, ఆమె గౌతమ్ అదానీకి చెందిన NGO అదానీ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. భర్త ఎదుగుదల కోసం ప్రీతి తన కెరీర్‌ను వదులుకోవడానికి వెనుకాడలేదు. తన భర్త 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫోటోను ట్వీట్ చేస్తూ, '36 ఏళ్లు గడిచాయి.. నా కెరీర్‌ను పక్కన పెట్టి, గౌతమ్ అదానీతో కొత్త ప్రయాణం ప్రారంభించాను. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనంటే నాకు ఎనలేని గౌరవం, గర్వం. అని పేర్కొనడం విశేషం. డెంటిస్ట్‌గా ఉంటే కొందరికి మాత్రమే సేవ చేయగలనని గ్రహించిన ఆమె.. అదానీ ఫౌండేషన్‌లో చేరిన లక్షలాది మందికి సేవ చేయగలనని గుర్తించి కెరీర్‌ను విడిచిపెట్టినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడంలో, అదానీకి అతని భార్య నుండి మంచి మద్దతు లభించిందని పలు మార్లు తెలిపారు. 'ప్రీతీ నా కుటుంబాన్ని, ఫౌండేషన్  పనుల్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిర్వహిస్తోంది. నిజంగా ఆమె ఓపికకు నేను ఆశ్చర్యపోతున్నాను అని గౌతం గుర్తు చేసుకున్నారు. ప్రీతి రోజూ 7-8 గంటలు ఇస్తుంది. ప్రీతి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్