ATM Cash Withdrawal: ఏటీఎం ఎడాపెడా వాడేస్తున్నారా..అయితే కస్టమర్లకు బ్యాంకుల షాక్

Published : Aug 17, 2022, 01:02 PM IST
ATM Cash Withdrawal: ఏటీఎం ఎడాపెడా వాడేస్తున్నారా..అయితే కస్టమర్లకు బ్యాంకుల షాక్

సారాంశం

ATM Cash Withdrawal: ఆగస్టు 1, 2022 నుండి అమలులోకి వచ్చేలా, బ్యాంకులు ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాయి. ఇకపై మీరు ఏటీఎం వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమితికి మించి ఏటీఎం వాడితే మీ జేబుకు కత్తెర పడటం ఖాయం. 

ATM Cash Withdrawal: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై చార్జీలను పెంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీని కింద ఒకే బ్యాంకు ఏటీఎంలో ఒక నెలలో 5 లావాదేవీలు ఉచితంగానూ, ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.21 వసూలు చేయనున్నారు. ఇతర బ్యాంకు ATMని ఉపయోగిస్తే, ఒక నెలలో 3 లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 21 చార్జ్ చేస్తారు. గతంలో ఇది రూ.15 ఉండగా ఇప్పుడు ఈ లిమిట్ 21 రూపాయలకు పెంచారు. అంటే ఇకపై ఏటీఎం నుంచి పదే  పదే డబ్బు విత్‌డ్రా చేయడం భారీగానే చార్జీలు ఉంటాయి. 

బ్యాంకులు ఇంటర్‌ చేంజ్ ఫీజును పెంచాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచడానికి అనుమతించింది, ఇప్పుడు ప్రతి ఆర్థిక లావాదేవీపై రూ.15కి బదులుగా రూ.17 ఇంటర్ చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, ఆర్థికేతర లావాదేవీల కోసం, మీరు 5కి బదులుగా రూ.6 చెల్లించాలి. వాస్తవానికి, మీరు ఒక బ్యాంకు ATM కార్డును మరొక బ్యాంకు ATMలో ఉపయోగించినప్పుడు, మీ బ్యాంక్ ప్రతి లావాదేవీపై ఆ బ్యాంక్‌కి ఫీజును చెల్లించాలి. 

ఇది ఇంటర్ చేంజ్ ఫీజును మరియు చివరికి బ్యాంకులు కస్టమర్ల నుండి వసూలు చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఇతర బ్యాంకు ATMని ఉపయోగించినప్పుడు, అది ఉచితం కాదని గుర్తుంచుకోండి. పెరుగుతున్న ఏటీఎం  నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎం సర్వీస్ చార్జీలను పెంచుతున్నాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
1. డెబిట్ కార్డ్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జీలు 

క్లాసిక్ డెబిట్ కార్డ్ - రూ. 125 + GST 
సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ - రూ.125 + GST 
యువ / గోల్డ్ / కాంబో / మై కార్డ్ ప్లస్ డెబిట్ కార్డ్ - రూ. 175 + GST
ప్లాటినం డెబిట్ కార్డ్ - రూ 250 + GST
ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్ – రూ. 350 + GST

2. డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీలు - రూ.300 + GST

3. మళ్లీ పిన్ పొందడానికి - రూ.50 + GST

4. లావాదేవీ ఛార్జీలు (ATM వద్ద)
>> 25,000 వరకు లావాదేవీలకు, సొంత బ్యాంకు నుండి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుండి 3 లావాదేవీలకు అనుమతిస్తారు.  

>> రూ.25,000 నుండి రూ.50,000 మధ్య లావాదేవీలకు, సొంత బ్యాంకు నుండి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుండి 3 లావాదేవీలకు అనుమతిస్తారు. 

>> 50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం మీరు ఇతర బ్యాంకుల నుండి 3 సార్లు, మీ స్వంత బ్యాంకు నుండి అపరిమితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 

మొదటి ATM 1987లో స్థాపించారు
HSBC బ్యాంకు 1987లో ముంబైలో మొట్టమొదటి ATMను ఏర్పాటు చేసింది, అప్పటి నుండి దేశవ్యాప్తంగా 1 లక్ష 15 వేల 605 ATMలు స్థాపించారు. 31 మార్చి 2021 నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా మొత్తం 90 కోట్ల డెబిట్ కార్డులు జారీ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !