లాజిస్టిక్స్ రంగంలో Adani Group పాగా.. ICD Tumb కొనుగోలు చేసిన అదానీ లాజిస్టిక్స్..

By Krishna AdithyaFirst Published Aug 17, 2022, 11:49 AM IST
Highlights

ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన గౌతం అదానీ తాజాగా మరో వ్యాపార ఒప్పందం ద్వారా తన సత్తా చాటారు. తాజాగా అదానీ లాజిస్టిక్స్ ద్వారా  inland container depot (icd) Tumb కొనుగోలు కోసం నవ్‌కార్ కార్పొరేషన్‌తో రూ.835 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. 

వరుస వ్యాపార ఒప్పందాలతో దూసుకెళ్తున్న అదానీ గ్రూపు తాజాగా మరో వ్యాపారం ఒప్పందం ద్వారా లాజిస్టిక్స్ రంగంలో బలమైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది.  అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన అదానీ లాజిస్టిక్స్  తాజాగా inland container depot (icd) Tumb కొనుగోలు కోసం నవ్‌కార్ కార్పొరేషన్‌తో రూ.835 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం కంపెనీ తెలిపింది.

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, Tumb అతిపెద్ద ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో, దీని సామర్థ్యం 5 లక్షల TEU. వ్యూహాత్మకంగా ఇది చాలా లాభదాయకమైన ఒప్పందం. హజీరా పోర్ట్,  నవా షెవా పోర్ట్ మధ్యలోనే ICD ఉంది. భవిష్యత్తులో కెపాసిటీ, కార్గో పెంచేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. Tumb ICD వెస్ట్రన్ DFCకి నాలుగు రైల్ హ్యాండ్లింగ్ లైన్‌లతో పాటు ఓ ప్రైవేట్ ఫ్రైట్ టెర్మినల్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

ఈ డీల్ గురించి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) CEO కరణ్ అదానీ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద inland container depot (icd)లలో ఒకటైన Tumb కొనుగోలు తమ వ్యాపార విస్తరణకు మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. ఒక ట్రాన్స్‌పోర్ట్ యుటిలిటీగా మారడానికి  కస్టమర్‌ ఇంటింటికీ ఆర్థికంగా సేవలను అందించాలనే మా లక్ష్యానికి చేరువ చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో నాల్గవ అత్యంత సంపన్నుడుగా అదానీ
భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు మాత్రమే కాదు, ప్రపంచంలోనే నాల్గవ ధనవంతుడు. ఫోర్బ్స్ యొక్క రియల్ టైమ్ జాబితా ప్రకారం, 134.6 బిలియన్ల నికర విలువతో, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి బిలియనీర్ల కంటే అదానీ ముందున్నారు. ఇది కాకుండా, అదానీ గ్రూప్ చైర్మన్ సంపాదన పరంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ఎలోన్ మస్క్‌తో సహా ఇతర బిలియనీర్ల కంటే కూడా ముందున్నారు.

టాప్-10 సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ ఏడాది అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ పారిశ్రామికవేత్తగా సంపద పెరుగుతున్న వేగంతో, అతను త్వరలో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడిగా మారే అవకాశాన్ని తోసిపుచ్చలేము.

ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది
తాజాగా గౌతమ్ అదానీకి ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. అయితే అదానీ తనకు ఇచ్చిన సెక్యూరిటీ ఖర్చులను తానే భరిస్తానన్నారు. IB థ్రెట్ పర్సెప్షన్ నివేదిక ఆధారంగా, MHA ఈ రక్షణను అదానీ గ్రూప్ ఛైర్మన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే, గౌతమ్ అదానీ తన వ్యాపారాన్ని విస్తరించి, సిమెంట్ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

click me!